VishwakSen : విశ్వక్‌సేన్ హిట్ 2 ఎందుకు చేయలేదు.. విశ్వక్‌ చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయా??

గతంలో హీరో నాని నిర్మాతగా విశ్వక్‌సేన్ హీరోగా హిట్ సినిమా వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం హిట్ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 రాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోగా విశ్వక్‌సేన్ ని కాకుండా...........

VishwakSen : విశ్వక్‌సేన్ హిట్ 2 ఎందుకు చేయలేదు.. విశ్వక్‌ చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయా??

VishwakSen in full swing with continues movies

VishwakSen :  యువ హీరోల్లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు విశ్వక్‌సేన్. నేడు విశ్వక్‌సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్‌సేన్ తర్వాతి సినిమాల గురించి చెప్పాడు. దీంతో విశ్వక్‌సేన్ చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు.

గతంలో హీరో నాని నిర్మాతగా విశ్వక్‌సేన్ హీరోగా హిట్ సినిమా వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం హిట్ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 రాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోగా విశ్వక్‌సేన్ ని కాకుండా అడివి శేష్ ని తీసుకోవడంపై గతంలో పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా దాని గురించి విశ్వక్‌సేన్ క్లారిటీ ఇస్తూ.. డేట్స్ అడ్జస్ట్ అవ్వకే హిట్ 2 సినిమా చెయ్యట్లేదు అంతే. నాకు వరుసగా సినిమాలు ఉన్నాయి. వాళ్ళు అడిగిన డేట్స్ కుదర్లేదు, అందుకే హిట్ 2 వదులుకున్నాను. నాని అన్న నాకు హిట్ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు అని తెలిపాడు.

అలాగే తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘దాస్‌ కా దమ్కీ’ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్‌ గారి దర్శకత్వంలో చేస్తున్న సినిమా నవంబర్ లో షూటింగ్ మొదలవ్వనుంది. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ‘గామీ’ సినిమాకు సీజీ వర్క్‌ ఎక్కువగా ఉంది, అందుకే ఆ సినిమా ఆలస్యం అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ లో ‘ఫలక్‌నుమాదాస్‌ 2’ కూడా చేయబోతున్నాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నిర్మాత రామ్‌ తాళ్లూరి గారితో వచ్చే సంవత్సరం ఓ సినిమా చేయబోతున్నాను అని తెలిపారు.

Ori Devuda : ఓరి దేవుడా ప్రమోషన్స్‌కి వెంకటేష్ ఎందుకు రాలేదు?

ఇవాళ రిలీజ్ అయ్యే ఓరి దేవుడా కాకుండా విశ్వక్‌సేన్ చేతిలో మొత్తం 5 సినిమాలు ఉన్నాయి. ఇంకా స్టోరీలు వింటున్నాడు. దీంతో ఈ యువ హీరో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూ కెరీర్ ని బాగా ప్లాన్ చేసుకుంటున్నాడుగా అని అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు.