Vishwaksen : అలాంటి వాళ్ళతో నాకెందుకు అని.. యాంకర్ దేవి నాగవల్లితో గొడవ గురించి అన్‌స్టాపబుల్ షోలో మాట్లాడిన విశ్వక్..

గతంలో పాగల్ సినిమా ప్రమోషన్స్ సందర్భంలో విశ్వక్‌సేన్ రోడ్డు మీద చేసిన ఓ ప్రమోషన్ బాగా వైరల్ అవ్వడంతో దానిపై కొన్ని నెగిటివ్ వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఓ న్యూస్ ఛానల్ విశ్వక్‌సేన్ ని ఇంటర్వ్యూకి పిలిచి...........

Vishwaksen : అలాంటి వాళ్ళతో నాకెందుకు అని.. యాంకర్ దేవి నాగవల్లితో గొడవ గురించి అన్‌స్టాపబుల్ షోలో మాట్లాడిన విశ్వక్..

Vishwaksen spoke about devi nagavalli issue in Unstoppable show

Vishwaksen :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో సీజన్ 2ని ఇటీవల మొదలైంది. అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ వ్యూస్ లో సరికొత్త రికార్డుని సృష్టించింది. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వచ్చారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ కూడా బాగా క్లిక్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు. యువ హీరోలతో కలిసి బాలయ్య బాబు రచ్చ చేశారు. వాళ్ళతో కలిసి సరదాగా మాట్లాడుతూ సెటైర్స్ వేస్తూ ఎంటర్టైన్ చేశారు.

ఈ ఎపిసోడ్ లో ఇద్దరు యువ హీరోలు చాలా ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. గతంలో పాగల్ సినిమా ప్రమోషన్స్ సందర్భంలో విశ్వక్‌సేన్ రోడ్డు మీద చేసిన ఓ ప్రమోషన్ బాగా వైరల్ అవ్వడంతో దానిపై కొన్ని నెగిటివ్ వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఓ న్యూస్ ఛానల్ విశ్వక్‌సేన్ ని ఇంటర్వ్యూకి పిలిచి మాట్లాడుతూ మధ్యలో ఆ మాటలు గొడవగా మారడంతో యాంకర్ దేవి నాగవల్లి విశ్వక్‌సేన్ ని స్టూడియో నుంచి వెళ్ళిపోమంది. విశ్వక్‌సేన్ ఏం మాట్లాడకుండా బయటకి వచ్చేశాడు. అప్పట్లో ఇది బాగా సంచలనంగా మారింది.

Siddhu Jonnalagadda : మొహం మీద మచ్చలు పెట్టుకొని హీరో అయిపోతావా అన్నారు.. అన్‌స్టాపబుల్ షోలో ఏడ్చేసిన డీజే టిల్లు..

తాజాగా అన్‌స్టాపబుల్ షోలో విశ్వక్ సేన్ దాని గురించి స్పందిస్తూ.. ”నాకు తెలిసి ఇటీవల నాకు జరిగిన పెద్ద అవమానం అంటే అదే సర్. ఓ యాంకర్ టీవీ షోకి ఇంటర్వ్యూకి పిలిచి గొడవ పెట్టుకొని బయటకి వెళ్ళిపోమంది. అక్కడ నా తప్పేమి లేదు. కానీ అలాంటి వాళ్ళతో మాట్లాడటం కంటే వెళ్లిపోవడం బెటర్ అని సైలెంట్ గా లేచి వచ్చేశాను. ఆ విషయంలో ప్రేక్షకులు నాకు బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు నా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ మాత్రం మర్చిపోలేను” అని తెలిపాడు.