Attacked By Cow : బాబోయ్.. కొమ్ములతో యువతిని ఎత్తిపడేసిన ఆవు, తలకు తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. హత్కేశ్వర్ ప్రాంతంలో శనివారం ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా.. అక్కడున్న ఆవు దాడి చేసింది. అమాంతం కొమ్ములతో ఎత్తిపడేసింది. దీంతో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Attacked By Cow : బాబోయ్.. కొమ్ములతో యువతిని ఎత్తిపడేసిన ఆవు, తలకు తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

Attacked By Cow : రోడ్డుపై సంచరించే పశువులు, మూగజీవాలు మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి ఊహించని విధంగా దాడికి దిగుతున్నాయి. ఈ క్రమంలో ప్రాణాలు పోతున్నాయి. కొందరు తీవ్ర గాయాల బారిన పడుతున్నారు. ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో ఓ చిన్నారిని వీధి కుక్కలు దారుణంగా దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. హత్కేశ్వర్ ప్రాంతంలో శనివారం ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా.. అక్కడున్న ఆవు దాడి చేసింది. అమాంతం కొమ్ములతో ఎత్తిపడేసింది. దీంతో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స
పొందుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Bull Attack : ఘోరం.. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఎద్దు దాడి, కొమ్ములతో పొడిచి పొడిచి చంపేసింది, వీడియో వైరల్

రోడ్డు మీద రెండు ఆవులు నిల్చుని ఉంది. ఆ రోడ్డు రద్దీగా ఉంది. రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి వస్తున్నాయి. కొందరు వ్యక్తులు నడుచుకుని వెళ్తున్నారు. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చింది. ఆమె రోడ్డు క్రాస్ చేసే పనిలో ఉంది. ఇంతలో వాహనం రావడంతో ఆమె సరిగ్గా ఆవు ముందే నిల్చుంది. వెనుక ఆవు ఉన్న విషయం ఆమెకు తెలుసు. అయితే ఏమీ చేయదు అనుకుంది. కానీ, ఏమైందో కానీ, సడెన్ గా ఆవు వైల్డ్ గా రియాక్ట్ అయ్యింది. తన కొమ్ములతో తన ముందు నిల్చుని ఉన్న మహిళను కొమ్ములతో ఎత్తి పడేసింది. అదే సమయంలో రోడ్డు మీద ఓ బైకర్ వెళ్తున్నాడు. అతడి బైక్ కి యువతి తగిలింది. ఈ ఘటనలో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Also Read..Shocking Video : షాకింగ్ వీడియో.. పేరెంట్స్ బీ కేర్‌ఫుల్, పిల్లాడు చేసిన పనికి స్కూటీ పైనుంచి ఎగిరిపడ్డ తండ్రి

బాధితురాలి పేరు పార్వతి కలారియా(30). శనివారం ఉదయం ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. దుపట్టా కొనేందుకు ఆమె బయటకు వచ్చింది. ఈ క్రమంలో లవకుశ్ బంగ్లా సమీపంలో రోడ్డు దాటేందుకు ఆగగా, వెనుక నుంచి ఆవు దాడి చేసింది. రోడ్డు దాటేందుకు వచ్చిన పార్వతి.. టెంపో రావడంతో చూసి ఆగింది. ఆ వాహనం వెళ్లాక రోడ్డు క్రాస్ చేయాలని అనుకుంది. అయితే ఆమె వెనకాలే ఆవు ఉంది.

అయినా అదేమీ చేయదనే ధైర్యంతో దాని ముందు నిలబడింది. ఏం జరిగిందో కానీ, అప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఆవు ఒక్కసారిగా వయలెంట్ గా రియాక్ట్ అయ్యింది. తన ముందు నిల్చున్న యువతిని కొమ్ములతో ఎత్తి పడేసింది. దీందో ఆమె తలకు గాయాలయ్యాయి. ఆవు యజమానిపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రోడ్డు మీద తిరుగుతున్న ఆవులు, ఎద్దుల గురించి మున్సిపాలిటీ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని స్థానికులు వాపోయారు. వారు ఎలాంటి చర్య తీసుకోలేదని మండిపడ్డారు.