Moon a Hindu Rashtra : చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించండి : హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి డిమాండ్

చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు. చంద్రయాన్ -3 ల్యాండింగ్ పాయింట్‌కి శివశక్తి అని పేరు పెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు....

Moon a Hindu Rashtra : చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించండి : హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి డిమాండ్

Moon a Hindu Rashtra

Moon a Hindu Rashtra : చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు. చంద్రయాన్ -3 ల్యాండింగ్ పాయింట్‌కి శివశక్తి అని పేరు పెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని హిందూ దార్శనికుడు స్వామి చక్రపాణి వీడియో సందేశంలో పిలుపునిచ్చారు. (Declare Moon a Hindu Rashtra) చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయాలని ఆయన ఎక్స్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. (Seer wants Parliament to pass resolution)

Neeraj Chopra : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు మరో బంగారుపతకం

చంద్రుడిపై హిందూ దేశాన్ని స్థాపించిన తర్వాత దానిని రాజధానిగా అభివృద్ధి చేయాలని స్వామి సూచించారు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రదేశంలో శివశక్తి పాయింట్‌ను రాజధానిగా అభివృద్ధి చేయాలని, తద్వారా జిహాదీ మనస్తత్వంతో ఏ ఉగ్రవాది అక్కడికి చేరుకోలేడని పేర్కొన్నారు. హిందూ ధర్మకర్త స్వామి చక్రపాణి మహారాజ్ గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Legendary poet : ప్రముఖ కవి జయంత మహాపాత్ర కన్నుమూత

2020వ సంవత్సరంలో స్వామి చక్రపాణి మహారాజ్ సంస్థ ఆల్ ఇండియా హిందూ మహాసభ. కొవిడ్-19 మహమ్మారి మొదటి వేవ్ సమయంలో గౌమూత్ర పార్టీ నిర్వహించింది. 2018వ సంవత్సరంలో గొడ్డు మాంసం తిన్న కేరళ వరద బాధితులకు సహాయం చేయకూడదని వ్యాఖ్యానించి సంచలనం రేపారు.