CVC Annual Report: దేశంలో అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వ శాఖ ఏదో తెలుసా?

ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు సీవీసీ చీఫ్ విజిలెన్స్ అధికారికి మూడు నెలల గడువు ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. నివేదిక ప్రకారం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అధికారులపై 46,643 ఫిర్యాదులను అందుకోగా, రైల్వేకు 10,580 ఫిర్యాదులు, బ్యాంకులకు 8,129 ఫిర్యాదులు అందాయి

CVC Annual Report: దేశంలో అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వ శాఖ ఏదో తెలుసా?

Most Corrupt Government Dept: ఇటీవల విడుదల చేసిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వార్షిక నివేదిక ప్రకారం గతేడాది అత్యధికంగా అవినీతి ఫిర్యాదులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులపైనే వచ్చాయి. దీని తర్వాత రైల్వే, బ్యాంకు అధికారులపై అత్యధిక ఫిర్యాదులు అందాయి. నివేదిక ప్రకారం, గత ఏడాది అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులపై మొత్తంగా 1,15,203 ఫిర్యాదులు అందాయి. వీటిలో 85,437 ఫిర్యాదులు పరిష్కరించగా, మిగిలిన 29,766 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 22,034 ఫిర్యాదులు మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖపై అత్యధిక ఫిర్యాదులు
ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు సీవీసీ చీఫ్ విజిలెన్స్ అధికారికి మూడు నెలల గడువు ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. నివేదిక ప్రకారం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అధికారులపై 46,643 ఫిర్యాదులను అందుకోగా, రైల్వేకు 10,580 ఫిర్యాదులు, బ్యాంకులకు 8,129 ఫిర్యాదులు అందాయి. హోం మంత్రిత్వ శాఖ సిబ్బందిపై వచ్చిన మొత్తం ఫిర్యాదులలో 23,919 ఇప్పటికే పరిష్కరించబడ్డాయి. కాగా, 22,724 పెండింగ్‌లో ఉన్నాయి, వీటిలో 19,198 మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

రైల్వే అధికారులపై ఫిర్యాదులు
నివేదిక ప్రకారం, రైల్వే 9,663 ఫిర్యాదులను పరిష్కరించింది. ఇక 917 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. అదే సమయంలో బ్యాంకుల్లో 7,762 అవినీతి ఫిర్యాదులను పరిష్కారించారు. ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ సిబ్బందిపై 7,370 ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిలో 6,804 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి.

ఈ మంత్రిత్వ శాఖల్లో అవినీతి
గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌) సహా ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్, హిందుస్థాన్ ప్రీఫ్యాబ్ లిమిటెడ్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్బీసీసీ, ఎన్సీఆర్ ప్లానింగ్ బోర్డు సిబ్బందిపై 4,710 ఫిర్యాదులు దాఖలయ్యాయి. వీటిలో 3,889 ఫిర్యాదులను పరిష్కరించారు.