World’s longest hair :పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన యువతి..12 ఏళ్లకు హెయిర్ కట్టింగ్..

World’s longest hair :పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన యువతి..12 ఏళ్లకు హెయిర్ కట్టింగ్..

World's Lonbest Hair

Cutting the world’s LONGEST HAIR Guinness World Records : నల్లగా ఒత్తుగా..పొడవైన కురులు కావాలని ప్రతీ అమ్మాయి ఆశపడుతుంది. కురులే మగువకు అందం అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఆడవాళ్లు కురుల్ని కవులు ఎంత గొప్పగా చెప్పారో కూడా ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. జుట్టు పొడవుగా పెంచుకోవాలని అందరికీ ఉంటుంది. అలా ఆశపడిన ఓ అమ్మాయి తన జుట్టు పొడవుతో ప్రపంచ రికార్డునే సొంతం చేసుకుంది. పొడవైన జుట్టు కోసం 12 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి ఒక్కసారి కూడా జుట్టుని కట్ చేయలేదు.

1

దీంతో ఆమె జుట్టు ఏకంగా 6 అడుగుల 6.7 అంగుళాల పొడవు పెరిగి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన గుజరాత్ అమ్మాయి నీలాంశీ పటేల్ గుర్తుందా? ఆ అమ్మాయి ఇన్నేళ్లకు తన జుట్టుని కట్టు చేయించుకుంది. పొడవాటి జుట్టుతో రికార్డులు క్రియేట్ చేసిన నీలాంశీ తన పొడవైన జుట్టుతో 2018 నుంచి 2020 వరకూ వరుసగా మూడు సంవత్సరాలు ఈ భారీ జుట్టుల రికార్డు నీలాంశీ పటేల్ పేరే ఉండటం మరో విశేషం. ఆ పొడవు కురుల టీనేజ్ యువతి ప్రపంచంలోనే పొడవైన జుట్టుగల టీనేజ్ యువతిగా ప్రపంచ రికార్డుల పరంపర సృష్టించింది. ఇప్పుడు తన జుట్టును విరాళంగా ఇచ్చింది.

2

గుజరాత్ కు చెందిన నీలాంశీ పటేల్. గత 12 ఏళ్ల నుంచి హెయిర్ కట్టింగ్ చేయించుకోలేదు. దీంతో ఆమె జుట్టు 6 అడుగుల 6.7 అంగుళాల పొడవు పెరిగింది. అలా పన్నెండేళ్ల తరువాత కటింగ్ చేయించుకుంది నీలాంశీ. ఆ పొడవైన కేశాలను మ్యూజియంకు విరాళంగా ఇచ్చింది. నీలాంశీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేశాలు గల టీనేజ్ యువతిగా ప్రపంచ రికార్డు సృష్టించింది. 2018 నుంచి 2020 వరకూ వరుసగా మూడు సంవత్సరాలు ఈ రికార్డు ఆమె పేరే ఉండటం మరో విశేషం.

7

నీలాంశీకి ఆరు సంవత్సరాలు ఉన్నప్పటినుంచీ కటింగ్ చేయంచుకోకూడదని పట్టుపట్టింది. నాకు పొడవాటి జుట్టు కావాలి..నాకు హెయిర్ కట్ట్ చే్యించొచ్చద్దని ఏడ్వటంతో ఆమెకు హెయిర్ కట్టింగ్ చేయించలేదు పెద్దవాళ్లు కూడా. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ నీలాంశీ జుట్టు కత్తిరించుకోలేదు.

5

నీలాంశీ వయసు ఇప్పుడు 18 ఏళ్లు. 12 ఏళ్ల పాటు హెయిర్ కట్టింగ్ చేయించుకోకపోవటంతో ఆమె జుట్టు అలా అలా కొల్లేరు చేంతాడు అంటారే అలా పెరగిపోయింది.అలా పెరిగిపెరిగీ 6 అడుగుల 6.7 పెరుగు పెరిగింది. 2020 జులైలో చివరిసారిగా 6 అడుగుల 6.7 అంగుళాల పొడవున్న జుట్టుతో ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది.

3

అలా పెంచుకున్న జుట్టును నీలాంశీ హెయిర్ కట్ చేయించుకుంది. బేబీ కట్టింగ్ చేయించుకుంది. అలా కట్ చేసిన కత్తిరించిన జుట్టును మ్యూజియంకు విరాళంగా ఇచ్చింది. దీని గురించి నీలాంశీ తల్లి మాట్లాడుతూ..చిన్నప్పనుంచి జుట్టు కట్ చేయిస్తామంటే ఏడ్చేదనీ..అలా పెంచుకున్న జుట్టును తన కూతురు మ్యూజియంకు ఇవ్వటం మంచిదేనని తెలిపారు.

44

అంతేకాదు నిలాంశీ తల్లి తన జుట్టును భారీగా పెంచుకుని ఆ పొడవాటి జుట్టుని కత్తిరించుకుని దాన్ని క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చారు. నిలాంశీ జుత్తు కత్తిరించుకుంటుండగా తీసిన వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ఈ ఆసక్తికర వీడియోను చూసేయండీ..!