Rajasthan Gang Rape : దొంగతనానికి వచ్చి దారుణం.. భర్తను బంధించి అతడి ముందే భార్యను గ్యాంగ్ రేప్ చేసిన దొంగలు

రాజస్తాన్ లో దారుణం జరిగింది. దొంగలు రెచ్చిపోయారు. దొంగతనానికి వచ్చిన దొంగలు దారుణానికి ఒడిగట్టారు. భర్తను బంధించిన దొంగలు అతడి కళ్ల ముందే భార్యను గ్యాంగ్ రేప్ చేశారు.

Rajasthan Gang Rape : దొంగతనానికి వచ్చి దారుణం.. భర్తను బంధించి అతడి ముందే భార్యను గ్యాంగ్ రేప్ చేసిన దొంగలు

Updated On : November 13, 2022 / 12:32 AM IST

Rajasthan Gang Rape : రాజస్తాన్ లో దారుణం జరిగింది. దొంగలు రెచ్చిపోయారు. దొంగతనానికి వచ్చిన దొంగలు దారుణానికి ఒడిగట్టారు. భర్తను బంధించిన దొంగలు అతడి కళ్ల ముందే భార్యను గ్యాంగ్ రేప్ చేశారు.

రాజస్తాన్ లోని సీరోహీ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. నలుగురు దుండగులు దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న దంపతులను బందీగా చేసుకున్నారు. డబ్బు ఇవ్వాలని వారిని బెదిరించారు. దీంతో దంపతులు తమ దగ్గరున్న రూ.1400 నగదు వారికి ఇచ్చారు. అయితే మరింత డబ్బు ఇవ్వాలని, విలువైన వస్తువులు ఇవ్వాలని దొంగలు అడిగారు. అయితే దంపతుల దగ్గర ఏమీ లేకపోయింది. దీంతో దొంగలు కోపంతో ఊగిపోయారు. భర్తను బంధించి అతడి కళ్ల ముందే అతడి భార్యను గ్యాంగ్ రేప్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ ఘటనతో దంపతులు షాక్ కి గురయ్యారు. వాళ్లు రెండు రోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. రెండు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నాలుగో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలి భర్త వాచ్ మన్ గా పని చేస్తాడని పోలీసులు తెలిపారు.