Suicide In Railway Station : షాకింగ్ వీడియో.. ఏం కష్టం వచ్చిందో.. అంతా చూస్తుండగానే రైలు కిందకి దూకి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతా చూస్తుండగానే అతడు పట్టాలపైకి దూకేశాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Suicide In Railway Station : షాకింగ్ వీడియో.. ఏం కష్టం వచ్చిందో.. అంతా చూస్తుండగానే రైలు కిందకి దూకి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

Suicide In Railway Station : ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతా చూస్తుండగానే అతడు పట్టాలపైకి దూకేశాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జనవరి 26న ఈ ఘటన జరిగింది. ఆయన పేరు రాకేష్ గౌడ్. పశ్చిమ రైల్వేలో చీఫ్ లోకో ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ఆయన ప్లాట్ ఫామ్ పై నిల్చుని ఉన్నారు. కాసేపు అటు ఇటు తిరిగారు. ఇంతలో రైలు రావడం గమనించాడు. అంతే.. అకస్మాత్తుగా ప్లాట్ ఫామ్ నుంచి ట్రాక్ పైకి దిగాడు. ఆ వెంటనే ట్రాక్ పై పడుకున్నాడు. ఇంతలో రైలు వచ్చేసింది. రైలు అతడి పైనుంచి వెళ్లడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.

Also Read..TTE Electric Shock : బాబోయ్.. రైల్వే స్టేషన్‌లో ఊహించని ప్రమాదం, మాట్లాడుతుండగానే కరెంట్ షాక్.. వీడియో వైరల్

రైల్వే ఉద్యోగి సూసైడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సమయంలో ప్లాట్ ఫామ్ పై కొందరు ప్రయాణికులు ఉన్నారు. ఆ వ్యక్తి అలా సూసైడ్ చేసుకోవడాన్ని కళ్లారా చూసి షాక్ అయ్యారు. ఆయన ఎందుకలా పట్టాలపైకి దిగాడో అర్థమయ్యేలోపే ఆయన ప్రాణం పోయింది. కళ్ల ముందే సూసైడ్ ఘటన చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు కారణం తెలియాల్సి ఉంది. పని ఒత్తిడి కారణంగా ఆ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోలేని రైల్వే అధికారులు తెలిపారు.

Also Read..Metro Station Woman Dragged : మెట్రో స్టేషన్‌లో షాకింగ్ ఘటన.. యువతిని ఈడ్చుకెళ్లిన రైలు