CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై దాడి చేసిన యువకుడు

భక్తియార్‌పూర్ పర్యటనలో ఉన్న సీఎం నితీశ్‌ను ఓ యువకుడు టార్గెట్‌గా చేసుకున్నాడు. ఓ విగ్రహానికి సీఎం నివాళులర్పిస్తుండగా.. సెక్యూరిటీని దాటుకుని వెళ్లి మరీ దాడి చేశాడు.

CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై దాడి చేసిన యువకుడు

Nitish

Bihar CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సెక్యూరిటీలో లోపం బయటపడింది. సీఎం నితీశ్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. పాట్నా సమీపంలోని భక్తియార్‌పూర్‌లో జరిగిందీ ఘటన.

భక్తియార్‌పూర్ పర్యటనలో ఉన్న సీఎం నితీశ్‌ను ఓ యువకుడు టార్గెట్‌గా చేసుకున్నాడు. ఓ విగ్రహానికి సీఎం నివాళులర్పిస్తుండగా.. సెక్యూరిటీని దాటుకుని వెళ్లి మరీ దాడి చేశాడు. బిత్తరపోయిన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకునేందుకు యత్నించారు.

Warn To CM : ‘సీఎం పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తా..హత్యకు ఓ షూటర్ ను కూడా నిమించుకున్నా’

అయినా యువకుడు వినకుండా సెక్యూరిటీని తోసుకుని వెళ్లి దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.