Viral video : ఇంటిగోడలో ఇవెందుకు దాచి పెట్టావురా నాయనా, ఏదో అనుకుంటే ఇంకేవో బయటపడ్డాయే పాపం..

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే..ఇలాంటివి కూడా ఇంటి గోడల్లా దాస్తారా..? ఎవడ్రా బాబూ వీడు ఇలాంటివి దాచి పెట్టావేంట్రా నాయనా..

Viral video : ఇంటిగోడలో ఇవెందుకు దాచి పెట్టావురా నాయనా, ఏదో అనుకుంటే ఇంకేవో బయటపడ్డాయే పాపం..

empty liquor bottles house wall

empty liquor bottles in house wall : ఓ పాత ఇంటిని కొంటే ఆ గోడలో బంగారు నాణాలు దొరికాయి అంటే కొన్ని వార్తలు విన్నాం. కానీ ఓ జంట కొన్న ఇంటిలో గోడలోంచి వెల్లువలా బయటపడినవాటిని చూసి షాక్ అయ్యాడు. గోడకు ఏదో ఒక చిన్న ఓపెన్ కనిపించటంతో లోపల ఏమన్నా విలువైనవి ఉన్నాయోమో అంటూ ఎంతో ఆశతో గోడను బద్దలు కొట్టి చూడగా బయటపడివాటిని చూసి షాక్ అయ్యాడు ఇంటి ఓనర్. ఇదేంటి రా బాబూ ఇలాంటివి పాత ఓనర్ ఎందుకు దాచి పెట్టాడే ఏంటో అంటూ వెర్రి ముఖం వేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొత్తగా కొన్ని ఇంటి ఓనర్ ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ చూస్తే పాపం ఏవో మణులు, మాణిక్యాలు, బంగారంలాంటివి దొరకుతాయని ఆశపడితే ఇదేంటీ రా బాబూ అనేలా ఉంది..

పాత ఇళ్లను కూల్చేసే సమయంలో పురాతన వస్తువులు, బంగారు నాణేలు తదితరాలు బయటపడ్డాయనే వార్తలు విన్నాం. టీవీలో చూశాం. అలాగే ఇంటి పునాదుల్లోనే కాదు ఇంటి గోడల నుంచి పాములు బయటపడ్డాయని కూడా విన్నాం. కానీ పాపం ఓ వ్యక్తి తను కొత్తగా కొన్న ఓ ఇంటి గోడలోంచి భారీ సంఖ్యలో మద్యం బాటిల్స్ బయటపడటం చూసి షాక్ అయ్యాడు. పోనీ అవేమన్నా మద్యం ఉన్న బాటిల్సా అంటే కాదు..అన్నీ ఖాళీ బాటిల్సే..వాటిని చూసి దిమ్మ తిరిగిపోయి పాపం వెర్రిమెహం వేశాడు.

Most Expensive Coffee : పిల్లుల మలంతో చేసే కాఫీ .. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టేస్టీ కాఫీ

న్యూజెర్సీలో (New Jersey) ఓ జంట.. కొన్ని నెలల కిందట ఓ ఇంటిని కొన్నారు. తాము కొన్న కొత్త ఇంటికి కూడా మకాం మార్చారు. ఆ ఇంటికి వచ్చిన కొన్ని రోజులకే ఆ ప్రాంతాన్ని వదలు ముంచెత్తాయి. దీంతో ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తరువాత వరద ఉదృతి తగ్గిపోయాకి తిరిగి వచ్చారు.బురద పేరుకుపోయిన ఇల్లు శుభ్రం చేసుకుంటున్న సమయంలో గోడల మధ్యలో ఏవే ఉన్నట్లు అనుమానం వచ్చింది. గోడ లోపలేమైనా విలువైనవి ఉన్నాయోయోనని ఆశగా గోడ పగులగొట్టి చూసి షాక్ అయ్యారు.

అయితే తీరా గోడలకు ఉన్న చెక్కలను తొలగించి చూడగా.. గోడల మధ్యలో ఖాళీ మద్యం సీసాలు (Empty liquor bottles) బయటపడ్డాయి. అవన్నీ రమ్ము సీసాలే కావడం చూసి ఇంటి యజమానులు అవాక్కయ్యారు. తీసేకొద్దీ గుట్టలు గుట్టలుగా బయటపడుతూనే ఉన్నాయి. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ తో ఊదరగొడ్తున్నారు. అది ఇల్లా తాగిపారేసిన బాటిల్స్ దాచే వైన్ షాపా..అని కొంతమంది..మరికొందరు ‘ఖాళీ మద్యం బాటిళ్లు గోడలో దాయడమేంట్రా బాబూ’’అంటూ కామెంట్స్ చేస్తున్నారు.