Asia Cup 2022: ఇప్పటివరకు ఏ భారత క్రికెటరూ నెలకొల్పని రికార్డు రేపటితో కొహ్లీ సొంతం

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కొహ్లీ రేపటితో మరో రికార్డు సృష్టించబోతున్నాడు. ఇప్పటికే కొహ్లీ 102 టెస్టు మ్యాచులు, 262 వన్డే మ్యాచులు.. అలాగే, 99 టీ20 మ్యాచులు ఆడాడు. రేపు ఆసియా కప్ లో భాగంగా భారత్-పాకిస్థాన్ తలబడనున్నాయి. దుబాయిలో ఈ మ్యాచు జరగనుంది. ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తారు. రేపటితో కొహ్లీ 100 టీ20 మ్యాచులు ఆడిన క్రికెటర్ గా నిలవనున్నాడు. అంతేకాదు, అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్ గా రికార్డు నెలకొల్పనున్నాడు.

Asia Cup 2022:  ఇప్పటివరకు ఏ భారత క్రికెటరూ నెలకొల్పని రికార్డు రేపటితో కొహ్లీ సొంతం

Asia Cup 2022

Asia Cup 2022: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కొహ్లీ రేపటితో మరో రికార్డు సృష్టించబోతున్నాడు. ఇప్పటికే కొహ్లీ 102 టెస్టు మ్యాచులు, 262 వన్డే మ్యాచులు.. అలాగే, 99 టీ20 మ్యాచులు ఆడాడు. రేపు ఆసియా కప్ లో భాగంగా భారత్-పాకిస్థాన్ తలబడనున్నాయి. దుబాయిలో ఈ మ్యాచు జరగనుంది. ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తారు. రేపటితో కొహ్లీ 100 టీ20 మ్యాచులు ఆడిన క్రికెటర్ గా నిలవనున్నాడు.

అంతేకాదు, అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్ గా రికార్డు నెలకొల్పనున్నాడు. విరాట్ కొహ్లీ 2008, ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన మ్యాచుతో తొలి అంతర్జాతీయ మ్యాచు ఆడాడు. టీమిండియాలో తనదైన ముద్ర వేసుకుని ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. 99 టీ20ల్లో 50.12 యావరేజ్ తో, కొహ్లీ 3,308 పరుగులు చేశాడు. టీ20ల్లో అతడి బెస్ట్ స్కోర్ 94. ఈ ఫార్మాట్ లో మొత్తం 30 అర్ధ సెంచరీలు బాదాడు.

కొంత కాలంగా కొహ్లీ మెరుగైన ఆటతీరును కనబర్చడం లేదు. రేపటి మ్యాచుతోనైనా మళ్ళీ ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. ఆసియా కప్ ను టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో ఆడనుంది. దుబాయి, షార్జాలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.

Viral video: మొసళ్ల మధ్య నదిలో పడిపోయిన బాలుడు.. ప్రాణభయంతో అరుపులు.. తర్వాత ఏం జరిగిందంటే..