Gujarat: అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ చేరి ‘మోదీ.. మోదీ..’ అంటూ నినాదాలు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఆప్ మంచి ఊపు మీదుంది. ఎలాగైనా జాతీయ స్థాయిలో ప్రభావం చూపించాలని ఊవిళ్లూరుతోంది. కాంగ్రెస్ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోన్న ఆప్‭కు గుజరాత్ రాష్ట్రమే ఎంట్రీ గేట్ అని భావిస్తోంది. గుజరాత్‭లో ఏమాత్రం ప్రభావం చూపినా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా మారొచ్చని ఆప్ యోచిస్తోంది. అందుకే రాష్ట్రంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తోంది.

Gujarat: అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ చేరి ‘మోదీ.. మోదీ..’ అంటూ నినాదాలు

Modi Modi Chants At Airport As Arvind Kejriwal Visits Gujarat

Gujarat: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గుజరాత్‭కు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‭కు వడోదర ఎయిర్‭పోర్ట్‭లో వింత అనుభవం ఎదురైంది. ఎయిర్‭పోర్ట్‭ నుంచి బయటికి వస్తుండగా ఆయనను చుట్టు ముట్టిన బీజేపీ కార్యకర్తలు ‘మోదీ.. మోదీ..’ అంటూ నినాదాలు చేశారు. కేజ్రీవాల్ రాకడ గురించి తెలుసుకుని బీజేపీ కార్యకర్తలు.. ఎయిర్‭పోర్ట్‭కు చేరుకుని కేజ్రీవాల్‭కు ఈ విధంగా స్వాగతం పలికారు.

కాగా, ఈ నినాదాలు వచ్చిన కాసేపటికే ‘కేజ్రీవాల్.. కేజ్రీవాల్’ అనే నినాదాలు సైతం వినిపించాయి. మోదీ నినాదాలు చేస్తున్న సమయంలో కేజ్రీవాల్ నవ్వుతూ కనిపించారు. అయితే ఆయనేమీ మాట్లాడలేదు. ఎన్నికల నేపథ్యంలో తరుచూ గుజరాత్ వస్తున్న కేజ్రీవాల్.. ఈసారి వడోదరలోని టౌన్ హాల్ మీటింగులో పాల్గొననున్నారు. ఇక కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనపై బీజేపీ నేత ప్రీతి గాంధీ స్పందిస్తూ.. ‘‘మోదీ గుజరాత్‭లోకి కేజ్రీవాల్‭కు స్వాగతం’’ అని ట్వీట్ చేశారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఆప్ మంచి ఊపు మీదుంది. ఎలాగైనా జాతీయ స్థాయిలో ప్రభావం చూపించాలని ఊవిళ్లూరుతోంది. కాంగ్రెస్ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోన్న ఆప్‭కు గుజరాత్ రాష్ట్రమే ఎంట్రీ గేట్ అని భావిస్తోంది. గుజరాత్‭లో ఏమాత్రం ప్రభావం చూపినా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా మారొచ్చని ఆప్ యోచిస్తోంది. అందుకే రాష్ట్రంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తోంది.

Bombay HC: కేంద్ర మంత్రి అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఉక్కు పాదం.. కూల్చివేయాలంటూ ఆదేశం