Virat Kohli: కోహ్లీ హోటల్ రూమ్ దృశ్యాలు లీక్.. వీడియో పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్

‘‘అభిమాన ఆటగాడిని చూసినప్పుడు, కలిసినప్పుడు ఫ్యాన్స్ చాలా సంబరపడిపోతారని నాకు తెలుసు.. వారి తీరు ప్రశంసనీయమేనని నేను భావిస్తాను. కానీ, ఈ వీడియో మాత్రం భయంకరం. ఈ వీడియో చూసి నా గోప్యత గురించి ఆలోచించి ఒక్కసారిగా నిశ్చేష్టుడిని అయిపోయాను. నా సొంత హోటల్ గదిలోనే నాకు గోప్యత లేకపోతే ఇంకెక్కడ దొరుకుతుందని నేను భావించాలి? ఇటువంటి ‘అభిమానం’ పట్ల నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ఇది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే. ప్రజల గోప్యతను గౌరవించండి. వినోదాన్ని పంచే సరుకుగా దాన్ని చూడకండి’’ అని కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

Virat Kohli: ”కింగ్ కోహ్లీ హోటల్ గది ఎలా ఉంటుందో చూడండి” అంటూ ఓ అభిమాని ఓ వీడియో పోస్ట్ చేశాడు. కోహ్లీ గదిలో ఏమేం ఉంటాయో, ఏయే వస్తువులు, మేకప్ లు వాడతాడో అన్నీ ఈ వీడియోలో చూపించాడు. కోహ్లీ లేని సమయంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో కోహ్లీ దృష్టికి వచ్చింది. దీంతో కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వ్యక్తిగత గోప్యతను గౌరవించకుండా ఇటువంటి వీడియోను ఎలా తీస్తారని, హోటల్ లో ఇటువంటి చర్యలకు పాల్పడడం ఏంటని నిలదీశాడు.

‘‘అభిమాన ఆటగాడిని చూసినప్పుడు, కలిసినప్పుడు ఫ్యాన్స్ చాలా సంబరపడిపోతారని నాకు తెలుసు.. వారి తీరు ప్రశంసనీయమేనని నేను భావిస్తాను. కానీ, ఈ వీడియో మాత్రం భయంకరం. ఈ వీడియో చూసి నా గోప్యత గురించి ఆలోచించి ఒక్కసారిగా నిశ్చేష్టుడిని అయిపోయాను. నా సొంత హోటల్ గదిలోనే నాకు గోప్యత లేకపోతే ఇంకెక్కడ దొరుకుతుందని నేను భావించాలి? ఇటువంటి ‘అభిమానం’ పట్ల నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ఇది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే. ప్రజల గోప్యతను గౌరవించండి. వినోదాన్ని పంచే సరుకుగా దాన్ని చూడకండి’’ అని కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

కాగా, ప్రస్తుతం కోహ్లీ ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడిన టీమిండియా రెండు మ్యాచుల్లో గెలిచి, ఒక దాంటో ఓడిపోయింది. ఈ టోర్నమెంట్లో విరాట్ కోహ్లీ బాగా రాణిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..