ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌కు అఫ్గాన్ జట్టు ప్రకటన.. కోహ్లీతో గొడవ పడిన ఆటగాడికి చోటు
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే దాదాపుగా అన్ని టీమ్‌లు తమ జట్లను ప్రకటించగా తాజాగా అఫ్గానిస్తాన్ కూడా తమ జట్టును వెల్లడించింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే దాదాపుగా అన్ని టీమ్‌లు తమ జట్లను ప్రకటించగా తాజాగా అఫ్గానిస్తాన్ కూడా తమ జట్టును వెల్లడించింది. 15 మందికి జట్టులో చోటు ఇచ్చింది. అఫ్గాన్ జట్టుకు హస్మతుల్లా షాహీది నాయకత్వం వహించనున్నాడు. అయితే.. ఆశ్చర్యకరంగా ఆసియా కప్‌లో అద్భుతంగా రాణిస్తున్న గుల్భాదిన్ నైబ్కు 15 మంది జట్టులో చోటు దక్కలేదు. అతడిని రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ఎవరైనా గాయపడితే అప్పుడు వారి స్థానంలో అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
భారత్‌లోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్‌లతో అఫ్గాన్ స్పిన్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. దాదాపు రెండేళ్ల తరువాత పేసర్ నవీన్ ఉల్ హక్ కు చోటు దక్కింది. భారత్‌లోని పిచ్‌లపై ఆడిన అనుభవం అతడికి ఉండడంతోనే అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నవీన్ ఉల్ హక్, ఫజల్ ఫారూఖీ, అబ్దుల్ రహమన్, ఒమర్జాయ్ లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
Kuldeep yadav 2.0 : పడిలేచిన కెరటం.. విమర్శలకు ఆటతోనే బదులిచ్చిన కుల్దీప్
కోహ్లీతో గొడవ..
గత ఐపీఎల్లో నవీన్ ఉల్ హాక్ లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో అతడు విరాట్ కోహ్లీతో గొడవకు దిగాడు. ఈ గొడవతో అతడు భారత ఫ్యాన్స్ దృష్టిలో విలన్‌గా మారిపోయాడు. ఆసియాకప్ 2023 కోసం ప్రకటించిన అఫ్గాన్ జట్టులో అతడికి చోటు దక్కలేదు. కోహ్లీతో గొడవ కారణంగానే అతడిని అఫ్గాన్ సెలక్టర్లు పక్కన బెట్టారనే ప్రచారం జరిగింది. దీంతో అతడికి వన్డే ప్రపంచకప్ జట్టులోనూ అవకాశం ఉండదని చాలా మంది భావించారు. అయితే.. అనూహ్యంగా అతడికి ఛాన్స్ ఇచ్చారు సెలక్టర్లు. దీంతో ప్రపంచకప్‌లో విరాట్-నవీన్ ల మధ్య పోరాటం చూడొచ్చునని క్రికెట్ ప్రేమికులు ఆనంద పడుతున్నారు.
వన్డే ప్రపంచకప్‌కు అఫ్గాన్ జట్టు ఇదే..
హస్మతుల్లా షాహీది (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజిబుర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్ హాక్ ఫారూఖీ, అబ్దుల్ రెహమాన్, నవీన్ ఉల్ హాక్,
Virat Kohli : లుంగీ డ్యాన్స్ పాటకు విరాట్ కోహ్లీ స్టెప్పులు.. వీడియో వైరల్
రిజర్వ్ ఆటగాళ్లు : గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రాఫ్, ఫరీద్ అహ్మద్ మాలిక్
ఇక బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న బంగ్లాదేశ్ తో ఆడనుంది. టీమ్ఇండియాతో అక్టోబర్ 11న తలపడనుంది. ఈ మ్యాచ్ కు ఢిల్లీ వేదిక కానుంది.
World Cup Bound AfghanAtalan Squad 🚨
Presenting before you the AfghanAtalan squad for the ICC Cricket World Cup 2023 in India. 🤩#AfghanAtalan | #CWC23 | #WarzaMaidanGata pic.twitter.com/r0SGg3KV8v
— Afghanistan Cricket Board (@ACBofficials) September 13, 2023