Mohammad Naim : నిప్పుల పై నడిచిన క్రికెటర్.. దేని కోసమో తెలుసా..?
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఈ టోర్నీ కోసం ఇందులో పాల్గొనున్న ఆసియా దేశాలు అన్ని ప్రాక్టీస్ మొదలెట్టేశాయి.
![Mohammad Naim : నిప్పుల పై నడిచిన క్రికెటర్.. దేని కోసమో తెలుసా..? Mohammad Naim : నిప్పుల పై నడిచిన క్రికెటర్.. దేని కోసమో తెలుసా..?](https://10tv.in/wp-content/uploads/2023/08/Mohammad-Naim.jpg)
Mohammad Naim
Mohammad Naim walks on fire : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ (Asia Cup) మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఈ టోర్నీ కోసం ఇందులో పాల్గొనున్న ఆసియా దేశాలు అన్ని ప్రాక్టీస్ మొదలెట్టేశాయి. ఆసియా కప్ ముగిసిన తరువాత 20 రోజుల వ్యవధిలోనే వన్డే ప్రపంచకప్ (ODI World Cup) ఆరంభం కానుంది. ఈ రెండు పెద్ద టోర్నీల్లో రాణించడం అంటే ఆశామాషీ కాదు. ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం సాధించగలం. అందుకనే ఒత్తిడిని తట్టుకునేందుకు క్రికెటర్లు ఒక్కొక్కరు ఒక్కొ పద్దతిని ఫాలో అవుతుంటారు.
తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మద్ నయీమ్ తీసుకుంటున్న శిక్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఎడమచేతి ఓపెనింగ్ బ్యాటర్ తన మానసిక దృఢత్వాన్ని మెరుగుపరచుకోవడానికి నిప్పుల మీద నడిచాడు. సబిత్ రేహాన్ ట్రైనర్ సాయంతో అతడు ఈ పని చేశాడు. వీడియోలో నయీమ్ చెప్పులు నెమ్మదిగా నిప్పుల పై నుంచి నడుచుకుంటూ వెళ్లి అవతలి వైపు ఉన్న గోనె సంచి మీద నిలబడ్డాడు. ఆ తరువాత అతడి కాళ్లపై నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది.
Rinku Singh : కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో రింకూ సింగ్‌పై ప్రశ్న.. సమాధానం చెబితే 6 లక్షల 40 వేలు
అయితే.. ఇదేం కొత్త కాదని గతంలో చాలా మంది క్రీడాకారులు దీన్ని ఫాలో అయినట్లు నెటీజన్లు చెబుతున్నారు. ధైర్యాన్ని పెంచుకోవడంతో పాటు మానసికంగా దృఢంగా ఉండేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్లో నయీమ్‌కు పేలవమైన రికార్డు ఉంది. 23 ఏళ్ల అతను ఈ ఏడాది మార్చిలో వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మూడు ఇన్నింగ్స్‌లలో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ ఆసియా కప్‌లో పాల్గొనే బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్‌గా అతడికి అవకాశం కల్పించారు.
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్.. నిజంగానే మనసున్న మా రాజు.. వీడియో వైరల్
Naim Sheikh working with a mind trainer ahead of Asia Cup. pic.twitter.com/mkykegJ06p
— Saif Ahmed 🇧🇩 (@saifahmed75) August 18, 2023