Ind Vs Pak: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్.. రోహిత్, గిల్ విధ్వంసం వల్లే.. మధ్యలో సచిన్ కూతురు ఏం చేసింది?

గిల్ హాఫ్ సెంచరీ బాదాక సారా టెండూల్కర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సెటైర్లు వేస్తున్నారు.

Ind Vs Pak: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్.. రోహిత్, గిల్ విధ్వంసం వల్లే.. మధ్యలో సచిన్ కూతురు ఏం చేసింది?

Ind Vs Pak - Memes

Ind Vs Pak – Memes: ఆసియా కప్-2023(Asia Cup 2023 )లో భాగంగా ఇవాళ జరుగుతున్న భారత్-పాకిస్థాన్ మ్యాచులో ప్రత్యర్థి బౌలర్లతో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అసలైన ఆట ఆడుకున్నారు. రోహిత్ శ‌ర్మ 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌ సాయంతో హాఫ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో భారత స్కోరు 15 ఓవ‌ర్ల‌కు 115/0గా ఉంది. అంతకు ముందు శుభ్‌మన్ గిల్ 37 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో అర్ధ శ‌త‌కం బాదాడు. 15 ఓవర్ల వరకు ఓపెనర్లు ఈ తీరుతో రెచ్చిపోతే భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం. అనంతరం రోహిత్ శర్మ 56, శుభ్‌మన్ గిల్ 58 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యారు.

ఓపెనర్లు ఇచ్చిన ఊపుతో భారత అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది. సామాజిక మాధ్యమాల్లో మీమర్స్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ను ఆకాశానికి ఎత్తేస్తూ పోస్టులు పెడుతున్నారు.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ అల్లుడు షాహీన్ అఫ్రిదితో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అల్లుడు శుభ్‌మన్ గిల్ (సారా టెండూల్కర్ వల్ల ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఇలా పిలుస్తున్నారు) క్రికెట్ మైదానంలో చెడుగుడు ఆడాడంటూ మీమ్స్ వస్తున్నాయి. అతడు హాఫ్ సెంచరీ బాదాక సారా టెండూల్కర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సెటైర్లు వేస్తున్నారు. చివరకు షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ లోనే గిల్ ఔట్ అయ్యాడు.

అల్లు అర్జున్ పుష్ప వేషంలో రోహిత్ శర్మ ఉన్నట్లు, తగ్గేదేలే అంటున్నట్లు కొందరు మీమ్స్ సృష్టించారు. హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ ని ఒక్కటి తగ్గింది పుష్ప అంటున్నట్లు కొందరు సెటైర్లు వేశారు. ఆ ఒక్కటీ ఏంటంటే సెంచరీనే.