IPL 2022: దిగ్గజ కెప్టెన్ నుంచి సంజూ శాంసన్‌కు కీపింగ్ టిప్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్‍‌తో మ్యాచ్ కు ముందు సంజూశాంసన్ కీలక మెలకువలు నేర్చుకుంటున్నాడు. వికెట్ కీపర్ గా ట్రైనింగ్ తీసుకుంటున్న శాంసన్ కు కుమర్ సంగక్కర శిక్షణనిస్తున్నాడు.

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‍‌తో మ్యాచ్ కు ముందు సంజూశాంసన్ కీలక మెలకువలు నేర్చుకుంటున్నాడు. వికెట్ కీపర్ గా ట్రైనింగ్ తీసుకుంటున్న శాంసన్ కు కుమర్ సంగక్కర శిక్షణనిస్తున్నాడు. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం హైదరాబాద్ జట్టుతో పోరాడుతుంది రాజస్థాన్ జట్టు. ఈ క్రమంలో ట్రైనింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది రాయల్స్ టీం.

సంగక్కర ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీలంక దిగ్గజ కెప్టెన్ సంగక్కర 134అంతర్జాతీయ టెస్టుల్లో 12వేల 400పరుగులు చేశాడు. 404 వన్డేల్లో 14వేల 234పరుగులు చేశారు. అంతేకాకుండా 56టీ20ల్లో 1382పరుగులు సాధించాడు.

ఐపీఎల్ కెరీర్లో 71 గేమ్స్ ఆడిన 1687పరుగులు చేసిన సంగక్కర పంజాబ్ కింగ్స్, డెక్కన్ ఛార్జర్స్, ఎస్సార్హెచ్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.

Read Also: పరిస్థితులకు తగ్గట్లు ఆడటం నేర్చుకున్నా – సంజూ శాంసన్

రాజస్థాన్ కెప్టెన్సీ అందుకున్న సంజూ శాంసన్.. గతేడాది ఏడోస్థానంలో సీజన్ ను ముగించిన జట్టును బెటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఐపీఎల్ 2021లో సంజూ 14గేమ్స్ ఆడి 484పరుగులు సాధించాడు. ఐపీఎల్ మొత్తం కెరీర్లో 121 మ్యాచ్ లలో 3వేల 68పరుగులు చేశాడు శాంసన్.

ట్రెండింగ్ వార్తలు