క్లారిటీ వచ్చేసింది.. ఉత్కంఠభరిత పోరులో విజయంతో సూపర్ -8లోకి దూసుకొచ్చిన బంగ్లాదేశ్ జట్టు

నేపాల్ జట్టును ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ సూపర్ 8కి అర్హత సాధించింది. బంగ్లా ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు గెలిచింది.

T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో నేపాల్ జట్టును ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ జట్టు సూపర్ -8లోకి అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 106 పరుగుల మాత్రమే చేయగలిగింది. అనంతరం 107 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నేపాల్ జట్టు తడబడింది. నేపాల్ బ్యాటర్లు క్రీజులోకి ఎక్కువ సేపునిలవలేదు. దీంతో కేవలం 85 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది.

Also Read : అయ్యయ్యో పాక్.. చివరి మ్యాచ్‌లోనూ అతి కష్టంమీద గెలుపు

నేపాల్ జట్టును ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ సూపర్ 8కి అర్హత సాధించింది. బంగ్లా ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లు సాధించింది. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికాతో పాటు బంగ్లాదేశ్ సూపర్ 8లోకి అడుగు పెట్టింది. దీంతో సూపర్ -8 దశలో ఈనెల 22న భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది.

Also Read : Bye Bye Pakistan : ఆజం ఖాన్ పాక్‌కు వెళ్ల‌డు.. బై బై పాకిస్తాన్ ట్రెండింగ్‌.. మీమ్స్ వైర‌ల్‌

సూపర్-8లో ఏఏ జట్టు ఏఏ జట్టుతో ఆడబోతుందో అనే విషయంపై క్లారిటీ వచ్చింది.
గ్రూప్ -1లో ..
భారత్, ఆస్ట్రేలియా, ఆప్గనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.
గ్రూప్ -2లో ..
యూఎస్ఏ, ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్టు తలపడనున్నాయి.

భారత్ జట్టు ఆడే మ్యాచ్ ల వివరాలు..
20న భారత్ వర్సెస్ ఆఫ్గానిస్థాన్
22న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
24న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు