Ms Dhoni New LooK: న్యూ లుక్ అదిరింది.. హాలీవుడ్ హీరోలా మహేంద్ర సింగ్ ధోనీ.. ఫొటోలు వైరల్

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ధోనీ వ్యాపారంపై దృష్టిసారించాడు. ఒకపక్క సినిమా నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టాడు. గత నెలలో అమెరికాలో అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తో..

Ms Dhoni New LooK: న్యూ లుక్ అదిరింది.. హాలీవుడ్ హీరోలా మహేంద్ర సింగ్ ధోనీ.. ఫొటోలు వైరల్

Mahendra Singh Dhoni

Mahendra Singh Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు వింటే చాలు యువ క్రికెటర్లు, క్రికెట్ అభిమానుల్లో తెలియని సంతోషం. క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్ కూల్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. తన నాయకత్వంలో టీమిండియాను అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 2023 ఐపీఎల్ లో చెన్నై జట్టును విజేతగా నిలపడంలో కీలక భూమిక పోషించాడు.

Read Also : Asian Games 2023: జాతీయ గీతాలాపన సమయంలో కన్నీరు పెట్టుకున్న యువ క్రికెటర్.. వీడియో వైరల్

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ధోనీ వ్యాపారంపై దృష్టిసారించాడు. ఒకపక్క సినిమా నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టాడు. గత నెలలో అమెరికాలో అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తో గోల్ఫ్ ఆడుతూ కనిపించిన ధోనీ.. ఇటీవల టెన్నిస్ ఆడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ధోనీ కొత్త లుక్ లో కనిపించాడు. హాలీవుడ్ హీరోను తలపించేలా ధోనీ లుక్ ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read Also : Asian Games 2023: ఆసియా క్రీడలు క్వార్టర్ ఫైనల్లో భారత్ జట్టు ఘన విజయం.. సెమీస్ లోకి ఎంట్రీ

బాలీవుడ్ సెలబ్రెటీ, ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ధోనీ న్యూ లుక్ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. నేను మహీ భాయ్ పొడవాటి జుట్టుకు విపరీతమైన అభిమానిని.. మేము అతని జట్టుకు సరికొత్త ఆకృతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రయత్నంలో ధోనీకి కొత్త లుక్ తీసుకురావటం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ధోనీతో పనిచేయడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని హకీమ్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో రాశాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Aalim Hakim (@aalimhakim)