Shivam Dube: ఐపీఎల్‌తో పాటు శివమ్ దూబెకు మరో గుడ్ న్యూస్

ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా రెండో రోజు ఇండియన్ ఆల్ రౌండర్ శివమ్ దూబెను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే శివ్ దూబెకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే శివమ్ దూబెకు..

Shivam Dube: ఐపీఎల్‌తో పాటు శివమ్ దూబెకు మరో గుడ్ న్యూస్

Shivam Dube 12

Shivam Dube: ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా రెండో రోజు ఇండియన్ ఆల్ రౌండర్ శివమ్ దూబెను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే శివ్ దూబెకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే శివమ్ దూబెకు కొడుకు పుట్టాడు. రూ.4కోట్ల వేలం పలికిన అదే రోజు ఫిబ్రవరి 13న కొడుకు పుట్టినట్లు గుడ్ న్యూస్ విన్నాడు దూబె.

ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు శివం దూబె.

కొద్ది గంటల తర్వాత వేలంలో అతణ్ని సొంతం చేసుకునేందుకు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ రూ.4కోట్లకు దక్కించుకుంది.

Read Also: థ్యాంక్యూ సీఎస్కే.. ఆర్సీబీకి వెళ్తున్నా

అదే రోజు దూబె అతని భార్య తల్లిదండ్రులు అయ్యారని తండ్రి విలువను మరోసారి కోట్లలో నిలబెట్టాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. .

గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన దూబె బ్యాటింగ్ తీరుకు కాస్త ప్రమోషన్ వచ్చి నాలుగో స్థానానికి చేరిన అంచనాలను అందుకోలేకపోతున్నాడు. అతని కనీస ధర రూ.50లక్షల నుంచి వేలం మొదలుకాగా రూ.2కోట్లు దగ్గర లక్నో సూపర్ జెయింట్స్.. పంజాబ్ కింగ్స్ మధ్య సందిగ్ధత మొదలైంది. మధ్యలో దూసుకొచ్చిన సీఎస్కే ఎట్టకేలకు చేజిక్కించుకుంది.

చివరి వరకూ పోరాడిన పంజాబ్ జట్టు రూ.4కోట్లు చేరగానే సైడ్ అయిపోయింది.