T20 World Cup-2022: పాక్ బౌలింగ్ మాకు ఓ సవాలు అని మాకు తెలుసు: రేపటి మ్యాచ్‌పై రోహిత్ శర్మ

‘‘పాకిస్థాన్ బౌలింగ్ ఎంత పటిష్ఠంగా ఉందో మాకు తెలుసు. టీమిండియాలో అనుభవం ఉన్న బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఇటువంటి రెండు జట్లు తలపడుతున్నాయి. పాక్ బౌలింగ్ మాకు ఓ సవాలు అని మాకు తెలుసు. మా బ్యాట్స్‌మెన్ సన్నద్ధంగా ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ బాగా చేయడం చాలా కీలకం’’ అని రోహిత్ శర్మ అన్నాడు.

T20 World Cup-2022: పాక్ బౌలింగ్ మాకు ఓ సవాలు అని మాకు తెలుసు: రేపటి మ్యాచ్‌పై రోహిత్ శర్మ

T20 World Cup-2022: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా రేపు భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇప్పటికే పలు వార్మప్ మ్యాచులు ఆడిన టీమిండియా, మెల్‌బోర్న్‌ చేరుకుంది. మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్ లో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపాడు.

‘‘పాకిస్థాన్ బౌలింగ్ ఎంత పటిష్ఠంగా ఉందో మాకు తెలుసు. టీమిండియాలో అనుభవం ఉన్న బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఇటువంటి రెండు జట్లు తలపడుతున్నాయి. పాక్ బౌలింగ్ మాకు ఓ సవాలు అని మాకు తెలుసు. మా బ్యాట్స్‌మెన్ సన్నద్ధంగా ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ బాగా చేయడం చాలా కీలకం’’ అని రోహిత్ శర్మ అన్నాడు.

కాగా, వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగాల్సిన ఆసియా కప్ కు భారత్ దూరం కానుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టోర్నీ పాక్ లో జరుగుతుండటంతో ఆ దేశానికి టీమిండియా వెళ్లదని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జై షా ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఆసియా కప్ లో ఆడేందుకు పాక్ కు టీమిండియా వెళ్తుందా? లేదా? అన్న విషయంపై రోహిత్ శర్మకు మీడియా ప్రశ్నించింది.

దీనికి రోహిత్ స్పందిస్తూ… ‘‘ప్రపంచ కప్ పైనే మేము దృష్టి పెట్టాం.. ఇప్పుడు ఇదే మాకు ముఖ్యం. భవిష్యత్తులోని టోర్నీలు ఎలా ఉంటాయన్న విషయంపై మేమేం ఆలోచించడం లేదు. వాటిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. రేపటి మ్యాచుకు ఎలా సన్నద్ధం కావాలన్న విషయంపైనే దృష్టి పెట్టాం’’ అని రోహిత్ శర్మ చెప్పాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..