Virat Kohli : సమంత సాంగ్‌‌కు కోహ్లీ స్టెప్స్.. వీడియో వైరల్

టీ20 లీగ్ 15వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరు జట్టు ముంబాయిలోని ఓ హోటల్ లో బయోబబుల్ లో బస చేస్తోంది. ఆ జట్టు ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి...

Virat Kohli : సమంత సాంగ్‌‌కు కోహ్లీ స్టెప్స్.. వీడియో వైరల్

Kohli

Virat Kohli : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫిల్మ్ లో హీరోయిన్ సమంత నటించిన ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావ.. అనే సాంగ్ టాలీవుడ్ ను ఊపేసింది. అంతేగాదు..దేశ వ్యాప్తంగా ఈ సాంగ్ పై డ్యాన్స్ లు వేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా ఈ సాంగ్ ఎవరికి తోచిన విధంగా డ్యాన్స్ లు వేశారు. తాజాగా.. ఈ పాటకు టీమ్ ఇండియా, బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హాల్ చల్ చేస్తోంది. ముంబాయిలోని ఓ హోటల్ లో కోహ్లీ చిందులేశాడు. ఈ స్టెప్స్ చూసిన అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు.

Read More : Virat Kohli: వివ్ రిచర్డ్స్‌ను ఇంప్రెస్ చేసిన విరాట్ కోహ్లీ

టీ20 లీగ్ 15వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరు జట్టు ముంబాయిలోని ఓ హోటల్ లో బయోబబుల్ లో బస చేస్తోంది. ఆ జట్టు ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన వినీ రామన్ తో వివాహ జీవితంలోకి అడుగుపెట్టాడు. భారత్ లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న అనంతరం ఆస్ట్రేలియాలో మరోసారి ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం బెంగళూరు వచ్చి జట్టులో కొనసాగుతున్నాడు. వివాహం సందర్భంగా.. నూతన దంపతులు బుధవారం రాత్రి బెంగళూరు ఆటగాళ్లకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో డుప్లెసిస్, కోహ్లీ దంపతులతో పాటు ఇతర ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. సమంతకు చెందిన సాంగ్ కు కోహ్లీ… చిందులేశాడు. ఫోటోలను అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు.