Viral Video: ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లి యువకుడిని కొట్టబోయిన పాకిస్థాన్ క్రికెటర్ హాసన్ అలీ

జనాల్లోకి దూసుకెళ్లి ఓ యువకుడిని కొట్టబోయాడు పాకిస్థాన్ బౌలర్ హాసన్ అలీ. తాజాగా, స్థానిక క్రికెట్ మ్యాచ్ లో హాసన్ అలీ ఆడాడు. ఆ సమయంలో ప్రేక్షకుల్లోంచి కొందరు హాసన్ అలీపై పలు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచులో హాసన్ అలీ కీలక సమయంలో ఒక క్యాచ్ మిస్ చేశాడంటూ ఎగతాళి చేశారు. ఆ మాటలు హాసన్ అలీకి వినపడ్డాయి. దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ ప్రేక్షకుల్లోకి దూసుకొచ్చి ఓ యువకుడిని అలీ కొట్టబోయాడు.

Viral Video: ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లి యువకుడిని కొట్టబోయిన పాకిస్థాన్ క్రికెటర్ హాసన్ అలీ

Viral Video

Viral Video: జనాల్లోకి దూసుకెళ్లి ఓ యువకుడిని కొట్టబోయాడు పాకిస్థాన్ బౌలర్ హాసన్ అలీ. తాజాగా, స్థానిక క్రికెట్ మ్యాచ్ లో హాసన్ అలీ ఆడాడు. ఆ సమయంలో ప్రేక్షకుల్లోంచి కొందరు హాసన్ అలీపై పలు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచులో హాసన్ అలీ కీలక సమయంలో ఒక క్యాచ్ మిస్ చేశాడంటూ ఎగతాళి చేశారు. ఆ మాటలు హాసన్ అలీకి వినపడ్డాయి.

దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ ప్రేక్షకుల్లోకి దూసుకొచ్చి ఓ యువకుడిని అలీ కొట్టబోయాడు. అక్కడున్న ఇతర ఆటగాళ్లు అతడిని అడ్డుకున్నారు. పాక్ లోని పంజాబ్, పక్పాట్టాన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాసన్ అలీ ప్రస్తుతం ఫాంలేమితో బాధపడుతున్నాడు. అతడు ఆడిన గత ఐదు టెస్టుల్లో కేవలం 5 వికెట్లు మాత్రమే తీయడంతో ఇంగ్లండ్ తో సిరీస్ కి అతడిని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.

Viral Video: ఏనుగు తొండంపై కర్రతో కొడుతూ రెచ్చగొట్టిన యువకుడు

దీంతో ఇటీవల హాసన్ అలీ మాట్లాడుతూ… దేశవాలీ క్రికెట్ మ్యాచుల సీజన్ లో బాగా రాణించి జాతీయ జట్టులో మళ్ళీ చోటు సంపాదిస్తానని అన్నాడు. కాగా, ఇటీవల జరిగిన టీ20 సిరీస్ లో పాక్ ఫైనల్ వరకు వెళ్లి ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..