Home » Cultivation of Dates
నాలుగో సంవత్సరం నుంచి ఖర్జూర చెట్లు కాపునకు వస్తాయి. ఫిబ్రవరి రెండో పక్షం నుంచి మార్చి మొదటి పక్షంలోనే పూత వస్తుంది. పూత వచ్చే నెల రోజులు ముందుగా నీటి తడులు ఆపేస్తే వాడుకు వచ్చి.. మంచి పూత, పిందె పడుతుంది.
ఖర్జూరపు తోటలు సాగు చేయాలంటే తొలి సంవత్సరం పెట్టుబడులు, ఖర్జులు అధికంగా భరించాల్సి ఉంటుంది. నాణ్యమైన మొక్కలు కొనుగోలు చేయటం , నాటటం, భూమి చదును, ఎరువులు, కూలీల ఖర్చు రిత్యా మొదటి సంవత్సరం ఎక్కువగా ఉంటుంది.