Cultivation of Dates : కరువు సీమలో ఖర్జూర సిరులు

ఖర్జూరపు తోటలు సాగు చేయాలంటే తొలి సంవత్సరం పెట్టుబడులు, ఖర్జులు అధికంగా భరించాల్సి ఉంటుంది. నాణ్యమైన మొక్కలు కొనుగోలు చేయటం , నాటటం, భూమి చదును, ఎరువులు, కూలీల ఖర్చు రిత్యా మొదటి సంవత్సరం ఎక్కువగా ఉంటుంది.

Cultivation of Dates : కరువు సీమలో ఖర్జూర సిరులు

Cultivation of Dates

Updated On : July 13, 2023 / 12:07 AM IST

Cultivation of Dates : ఎడారిలో పెరిగే వృక్షం ఖర్జూరం. పోషక విలువలతో కూడిన తియ్యదనం దాని సొంతం. ఈత చెట్టును పోలిఉండే ఈ ఖర్జూరం తెలుగు రాష్ట్రాల్లో కాయటం కష్టమే. దీనిని సాగు చేయటమంటే సాహసమంటే. అలాంటి ఖర్జూరం కరువు సీమగా పేరుగాంచిన అనంతపురం జిల్లాల్లో ఖర్జూరం సిరులు కురిపిస్తున్నాయి. మూడేళ్ళ క్రితం నాటిన ఓ రైతు ప్రస్తుతం మంచి దిగుబడులు పొందుతున్నాడు. స్ధానికంగా విక్రయిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు.

READ ALSO : Lady Fingers Cultivation : బెండసాగుతో.. రైతులకు లాభాలు అధికం

తరాలు మారుతున్నాయి. అవసరతను మార్కెట్లో క్షుణ్ణంగా పరిశీలించిన వారు కొత్త పంటలలో ఉన్న అవకాశాలను వెతికి పట్టుకుని అద్భుత విజయాలను నమోను చేస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందుకు నిదర్శనమే అనంతపురం రైతు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మత్తాడు గ్రామానికి చెందిన రమణారెడ్డి మూడేళ్ళక్రితం ఖర్జూరం సాగు చేపట్టి నాణ్యమైన దిగుబడులు తీస్తున్నారు.

READ ALSO :  High Profit Farming : 10 ఎకరాల్లో వరితో పాటు పసుపు, కూరగాయల సాగు.. పెట్టుబడిలేని సాగుతో లాభాలు పొందుతున్న రైతు

ఖర్జూరపు తోటలు సాగు చేయాలంటే తొలి సంవత్సరం పెట్టుబడులు, ఖర్జులు అధికంగా భరించాల్సి ఉంటుంది. నాణ్యమైన మొక్కలు కొనుగోలు చేయటం , నాటటం, భూమి చదును, ఎరువులు, కూలీల ఖర్చు రిత్యా మొదటి సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. రెండు, మూడు సంవత్సరాలు కొంత పెట్టుబడి తగ్గుతుంది. నాలుగవ ఏడాది నుండి దిగుబడి ప్రారంభమౌతుంది. ఐదవ ఏడాది నుండి అధిక దిగుబడి వస్తుంది.

READ ALSO : vegetables Cultivation : అర ఎకరంలో 16 రకాల కూరగాయల సాగు.. ఏడాదికి రూ.1 లక్షా 50 వేల ఆదాయం

ఒక్కసారి నాటితే 50 సంవత్సరాల వరకు పంటదిగుబడి తీసుకోవచ్చు. మూడేళ్ళు జాగ్రత్తగా పెంచితే నాలుగవ సంవత్సరం నుండి ఖర్జూరం చెట్లు కాపుకు వస్తాయి. ఫిబ్రవరి రెండవ వారం నుండి మార్చి రెండవ వారం వరకు పూత వస్తుంది. పూత వచ్చే నెలరోజుల ముందుగా నీటి తడులు ఆపేస్తే మంచి పూత, పిందె పడుతుంది. తోటలు ఎకరాకు 10 నుండి 12 మగ ఖర్జూర చెట్లు నాటుకోవాలి. మగ చెట్లు కేవలం పూలు పూస్తాయి. అవి పూసే పూలతో ఆడచెట్ల పూలు పరపరాగ సంపర్కం చేయించాలి. ప్రతి గెలకు జాగ్రత్తగా ఈ ప్రక్రియను చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Pests In Brinjal : వంగసాగులో చీడపీడలు…నివారణ

ఇలా ఈ రైతు కూడా మేలైన యాజమాన్యపద్ధతులు పాటిస్తూ నాణ్యమైన దిగుబడి తీస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్ధానికంగా అమ్ముతున్నారు. నీటి యద్దడి అధికంగా ఉన్న ప్రాంతాలు, సమస్యాత్మక భూముల్లో సైతం సులభంగా పెరగగల మొండి జాతి మొక్క ఖర్జూర. తాజా పండ్లకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు మంచి అవకాశంగా మారింది. ఈ పంటకు చీడపీడల బెడద చాలా తక్కువ. ప్రారంభ పెట్టుబడి అధికంగా ఉన్నా 5 సంవత్సరాలలో తిరిగి రాబట్టుకొనే అవకాశం ఉంది. తరువాత 50 సంవత్సరాలకు పైగా నికర అదాయం అందించే పంటగా ఖర్జూరాను పేర్కొనవచ్చు.