vegetables Cultivation : అర ఎకరంలో 16 రకాల కూరగాయల సాగు.. ఏడాదికి రూ.1 లక్షా 50 వేల ఆదాయం

వ్యవసాయ అధికారులు సూచనల మేరకు ఈ ఏడాది ప్రకృతి విధానంలో సాగు చేపట్టారు. పంట మంచి ఆరోగ్యంగా పెరిగింది. ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. మార్కెట్‌లో ఒక పంటకు ధర తగ్గినా.. మరో పంటకు ధర ఎక్కువగా పలుకుతుండటంతో నష్టం వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతు నక్క రామగోవిందు.

vegetables Cultivation : అర ఎకరంలో 16 రకాల కూరగాయల సాగు.. ఏడాదికి రూ.1 లక్షా 50 వేల ఆదాయం

vegetables Cultivation

vegetables Cultivation : అర ఎకరం పొలం ఉన్న రైతు, ఎంత పంట పండిస్తే మాత్రం, ఏమంత సంతోషం కలుగుతుంది.. ? అని ఎవరైనా అనుకుంటూ ఉంటే, వారు నిస్సందేహంగా పప్పులో కాలేసినట్లే. ఒకటికి పదహారు పంటలు పండిస్తే.. ఆ కుటుంబం ఆనందంగా జీవించడమే కాదు, ఆర్ధికంగా నిలదొక్కుకోవచ్చని నిరూపిస్తున్నారు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. అర ఎకరం 16 పంటలు పండిస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : Pests In Brinjal : వంగసాగులో చీడపీడలు…నివారణ

మారుతున్న కాలానికి అనుగుణంగా, పంటల సరళిని మార్చుతున్నారు రైతులు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలను సాగు చేసి మంచి లాభాలను గడిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు రైతు నక్క రామ గోవిందు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామానికి చెందిన ఈయన.. 40 సెంట్ల భూమిలో వంగసాగు చేపట్టారు.

తనపొలంలో అంతర పంటలగా ఉల్లి, చిక్కుడు, వేరుశనగ, క్యారెట్‌, బీరతో పాటు, పలు రకాల ఆకూరలను సాగు చేస్తున్నారు. గతంలో రసాయనిక ఎరువులతో పండించేవారు. అయితే పెట్టుబడి ఖర్చులు పెరిగేవి .. లాభాలు అంతగా వచ్చేవికావు.

READ ALSO :  Ivy Gourd : దొండసాగులో మెళుకువలు, యాజమాన్య పద్దతులు

వ్యవసాయ అధికారులు సూచనల మేరకు ఈ ఏడాది ప్రకృతి విధానంలో సాగు చేపట్టారు. పంట మంచి ఆరోగ్యంగా పెరిగింది. ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. మార్కెట్‌లో ఒక పంటకు ధర తగ్గినా.. మరో పంటకు ధర ఎక్కువగా పలుకుతుండటంతో నష్టం వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతు నక్క రామగోవిందు.

రైతు సాధికారిక సంస్థ , ప్రకృతి వ్యవసాయ అధికారులు ప్రోత్సాహంతో, పశువుల వ్యర్థాలతో, ఎరువులను తయారు చేస్తూ.. పంటలకు అందిస్తున్నారు రైతు. అంతే కాదు చుట్టుప్రక్కల రైతులకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పిస్తూ.. సాగులో మెళకువలను చెబుతున్నారు.

READ ALSO : Boron Deficiency : కొబ్బరి సాగులో బోరాన్ లోపం, నివారణ మార్గాలు!