Airtel Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరే ఆఫర్లు.. ఈ ప్లాన్లతో డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్, ఓటీటీ బెనిఫిట్స్ మీకోసం..

Airtel Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. ఎయిర్‌టెల్ అందించే ఆఫర్లతో డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, DTH బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఉచితగా OTT సబ్‌స్క్రిప్షన్ అన్నీ Airtel బ్లాక్ ప్యాకేజీ కింద అందిస్తోంది.

Airtel Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరే ఆఫర్లు.. ఈ ప్లాన్లతో డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్, ఓటీటీ బెనిఫిట్స్ మీకోసం..

Airtel is offering mobile, broadband, DTH and OTT benefits with these plans

Airtel Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. ఎయిర్‌టెల్ అందించే ఆఫర్లతో డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, DTH బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఉచితగా OTT సబ్‌స్క్రిప్షన్ అన్నీ Airtel బ్లాక్ ప్యాకేజీ కింద అందిస్తోంది. ఇప్పటికే ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌పై ఒకే బిల్లులో ఫైబర్, DTH మొబైల్‌తో సహా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్‌టెల్ సర్వీసులను క్లబ్ చేసేందుకు ఎయిర్‌టెల్ బ్లాక్ యూజర్లకు అందిస్తుంది.

ఎయిర్‌టెల్ బ్లాక్ కస్టమర్‌కు ఒకే బిల్లు, ఒక ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్‌ల టీంతో కస్టమర్ కేర్ నంబర్ లోపాలు సమస్యలకు పరిష్కారాన్ని కూడా అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ ద్వారా జీరో-స్విచింగ్ ఇన్‌స్టాలేషన్ ఖర్చులతో పాటు లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ పొందవచ్చు. ఎయిర్‌టెల్ రూ. 699 నుంచి 2,999 వరకు వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తోంది. ఆయా ప్లాన్‌లను ఓసారి పరిశీలిద్దాం.

రూ. 699 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ బ్లాక్ ద్వారా ఎంట్రీ-లెవల్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ల్యాండ్‌లైన్ కనెక్షన్, ఫైబర్ ద్వారా 40Mbps వరకు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్, DTH కనెక్షన్‌లో రూ. 300 విలువైన టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో Disney Hotstar, Sony Liv, Airtel XStream యాప్, మరో 12 OTT యాప్‌లకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. ప్లాన్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందించదు. దీనిని Airtel ప్రీపెయిడ్ యూజర్లు కూడా కొనుగోలు చేయవచ్చు.

రూ. 899 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ :
ఈ ప్లాన్ 105 GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 2 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లను అందిస్తుంది. ఈ ఆఫర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, 12 ఇతర యాప్‌లకు DTH, OTT సబ్‌స్క్రిప్షన్‌లపై రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లు కూడా ఉన్నాయి.

రూ. 1098 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ :
ఈ ప్లాన్ 75 GB ఇంటర్నెట్, అన్ లిమిటెడ్ కాలింగ్‌తో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో పాటు 100Mbps స్పీడ్‌తో అందిస్తుంది. ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్‌కు ఉచిత సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది.

Airtel is offering mobile, broadband, DTH and OTT benefits with these plans

Airtel is offering mobile, broadband, DTH and OTT benefits with these plans

రూ. 1099 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ :
ఈ సబ్‌స్క్రిప్షన్ ల్యాండ్‌లైన్ ద్వారా అన్ లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. ఫైబర్‌పై 200Mbps వరకు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, మరో 13 యాప్‌లతో సహా రూ.350 విలువైన OTT ఛానెల్‌లకు కూడా యూజర్లకు యాక్సెస్ అందిస్తుంది.

రూ. 1599 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ :
అన్‌లిమిటెడ్ కాలింగ్, 300Mbps ఇంటర్నెట్ వేగంతో, ప్లాన్ ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌తో వస్తుంది. ఇందులో రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లతో DTH కనెక్షన్ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, మరిన్ని OTT బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

రూ. 1799 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ :
ఈ ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌లో ఫైబర్, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌తో కూడిన ల్యాండ్‌లైన్, గరిష్టంగా 200Mbps స్పీడ్ అందిస్తుంది. ఈ ప్లాన్ 190GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్‌తో 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లను కూడా అందిస్తుంది. OTT బండిల్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వంటి ఇతర సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి.

రూ. 2299 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ బ్లాక్ కింద అన్ లిమిటెడ్ కాలింగ్, 300 Mbps డేటాతో ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను అందించే అత్యంత ఖరీదైన ప్లాన్. 240 GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లను రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లతో DTH కనెక్షన్‌ను కూడా అందిస్తుంది. OTT బండిల్‌లో Netflix, Prime Videos, Disney Plus, Hotstar, Airtel Xstream మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G vs Airtel 5G : జియో 5G vs ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్.. ఏయే స్మార్ట్‌ఫోన్లలో సపోర్టు చేస్తుంది? ఇందులో ఏది బెటర్ అంటే? పూర్తి వివరాలు మీకోసం..!