Amazon Great Indian Festival Sale : అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 13, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్లు.. ఎప్పుడంటే?

Amazon Great Indian Festival Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) అధికారికంగా ధృవీకరించింది. అమెజాన్ ఇంకా సేల్ తేదీలను వెల్లడించలేదు. ఈ నెలాఖరులో జరిగే ఫెస్టివల్ సీజన్‌లో సేల్ నిర్వహించే అవకాశం ఉంది.

Amazon Great Indian Festival Sale : అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 13, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్లు.. ఎప్పుడంటే?

Amazon Great Indian Festival sale announced, discounts on iPhone 13 and iPhone 12 revealed

Amazon Great Indian Festival Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) అధికారికంగా ధృవీకరించింది. అమెజాన్ ఇంకా సేల్ తేదీలను వెల్లడించలేదు. ఈ నెలాఖరులో జరిగే ఫెస్టివల్ సీజన్‌లో సేల్ నిర్వహించే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ (Flipkart Big Billion Days Sale)ను హోస్ట్ చేసే సమయంలోనే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Great Indian Festival Sale) కూడా నిర్వహించే అవకాశం ఉంది.

ఈ రెండు మెగా ఫెస్టివల్ సేల్స్ ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్ ఆఫర్ (Amazon Offers) చేసే ఆకర్షణీయమైన డీల్స్ గురించి వివరాలను వెల్లడించింది. ఆపిల్ ఐఫోన్‌లలో ప్రధానంగా iPhone 12, iPhone 13 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందించనుంది.

అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ కూడా తమ ప్లాట్ ఫాంపై ఐఫోన్ 13 (iPhone 13), ఇతర మోడళ్లపై భారీ డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఫెస్టివల్ సీజన్‌ను బెస్ట్ డీల్‌గా మార్చింది. అదనంగా.. అమెజాన్ టీజర్ iQOO 9T, OnePlus 10T వంటి అనేక ఇతర Samsung, Realme, Redmi, iQOO, Oppo, Vivo, Lava, Nokia ఫోన్‌లతో సహా కొన్ని ప్రముఖ ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తుందని వెల్లడించింది. అదనంగా, అమెజాన్ టెలివిజన్లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను కూడా అందిస్తుంది.

Amazon Great Indian Festival sale announced, discounts on iPhone 13 and iPhone 12 revealed

Amazon Great Indian Festival sale announced, discounts on iPhone 13 and iPhone 12 revealed

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం.. అమెజాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో భాగస్వామ్యమై 10 శాతం అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందించింది. ఈ బ్యాంక్ ఆఫర్ SBI డెబిట్, క్రెడిట్ కార్డ్‌పై అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్ ఒకే సమయంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించేందుకు ICICI, యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పుడు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ పండుగ సేల్స్ ప్రకటించడంతో కొత్త ఐఫోన్ మోడల్‌ను కచ్చితంగా బెస్ట్ టైమ్ అనే చెప్పాలి.

మీరు సరికొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేసినట్టయితే ఇదే సరైన సమయం. మీరు ఐఫోన్ 13ని కొనుగోలు చేయాలనుకుంటే.. ఐఫోన్ 14 లాంచ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ సేల్స్ నుంచి మీకు నచ్చిన ఫోన్‌ను ఎంచుకోవచ్చు. ఐఫోన్ 14ను ప్రకటించిన తర్వాత, ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు ఐఫోన్ 12 సిరీస్ ధరలను కూడా తగ్గించాలని భావిస్తున్నారు.

Read Also : iphone 13 Deal : ఐఫోన్ 14 వస్తోంది.. ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు.. ఎందులో డీల్ బెటర్ అంటే?