Apple iPhone 14 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ తగ్గింపు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

Apple iPhone 14 Pro Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ తగ్గింపు అందిస్తోంది.

Apple iPhone 14 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ తగ్గింపు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

Apple iPhone 14 Pro Available at Massive Discount on Flipkart Before Discontinuation

Apple iPhone 14 Pro Discount : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అదిరే వార్త.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అత్యంత డిమాండ్ ఉన్న ఆపిల్ ఐఫోన్ 14 ప్రో లాంచ్ నుంచి అసాధారణమైన డిమాండ్‌ను కలిగి ఉంది. ఫలితంగా.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) వంటి పాపులర్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో తరచుగా అమ్మకాలు జరుగుతాయి.

అయితే, 2 వారాల్లోపు ఆపిల్ ఐఫోన్ 15 ప్రో లాంచ్ కానుంది. ఐఫోన్ 14 ప్రో నిలిపివేయనుంది. ఇప్పటివరకు అత్యంత అధునాతన ఆపిల్ ఐఫోన్ మోడల్‌గా (iPhone 14 Pro) మరింత దృష్టిని ఆకర్షించింది. మీరు iPhone 14 ప్రో కొనుగోలు చేయాలనుకుంటే.. ఇప్పుడే కొనేసుకోండి. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌ను త్వరలో నిలిపివేయనుంది. ముందుగా భారీ తగ్గింపులను అందిస్తోంది.

Read Also : Apple AirPods Sale : ఇది కదా ఆఫర్ అంటే.. కేవలం రూ.250కే ఆపిల్ AirPods సొంతం చేసుకోండి.. డోంట్ మిస్..!

డైనమిక్ ఐలాండ్, విశేషమైన 48MP కెమెరాతో iPhone 14 Pro గత ఏడాదిలో రూ. 1,29,900 ప్రారంభ ధరతో వచ్చింది. అయితే, ఐఫోన్ 15 ప్రో లాంచ్‌ (Apple iPhone 15 Pro) కు ముందు.. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్రో ధరను కేవలం రూ. 66,999కి తగ్గించింది. తద్వారా ఐఫోన్ 14 ప్రో రూ. 62,901 అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తుంది. అంటే.. ఐఫోన్ 14 ప్రోని అధికారిక ఆపిల్ స్టోర్ ఐఫోన్ 13 కన్నా తక్కువ ధరకు ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Apple iPhone 14 Pro Available at Massive Discount on Flipkart Before Discontinuation

Apple iPhone 14 Pro Discount Available at Massive Discount on Flipkart Before Discontinuation

ఐఫోన్ 14 ప్రో బేస్ స్టోరేజ్ మోడల్‌ను పొందడం కష్టం. రూ. 9,901 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,19,999 ధరతో iPhone 14 ప్రో 128GB వేరియంట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ. 50వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీని ధరను రూ.69,999కి తగ్గుతుంది.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్నవారికి లేదా డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 3వేలు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆకర్షణీయమైన ఆఫర్లతో కలిపి, ఆపిల్ ఐఫోన్ 14 ప్రోని ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ. 66,999 కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 14 ప్రో కొత్త డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో కంపెనీ మొట్టమొదటి ‘నాచ్‌లెస్’ ఫోన్‌గా గుర్తింపు పొందింది. అత్యాధునిక A16 బయోనిక్ చిప్‌తో పవర్ అందిస్తుంది. ఆకట్టుకునే 48MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఈ డివైజ్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేతో వస్తుంది. దాంతో పాటు 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.

Read Also : Moto G62 5G Discount : ఫ్లిప్‌కార్ట్‌లో మోటో G62 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే కొనేవరకు ఆగలేరు!