Best 5G Phones : రూ.30వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!
ఆగస్ట్ 2022లో కొత్త 5G-సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటే.. అందులో మీకోసం కొన్ని స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాం. అందులో మీకు నచ్చిన బ్రాండ్ 5G స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Best 5G Phones : భారత మార్కెట్లో అతి త్వరలో 5G నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. అయితే మీ స్మార్ట్ఫోన్లలో 5G సపోర్టు ఉందో లేదో చెక్ చేసుకోండి. మిడ్-5G ఫ్రీక్వెన్సీలకు సపోర్టులతో చాలా స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కనెక్టివిటీ ఆప్షన్ మాత్రమే కాకుండా.. చాలా ఫోన్లు అదిరే పర్ఫార్మెన్స్, కెమెరాలను అందిస్తాయి. ఆగస్ట్ 2022లో కొత్త 5G-సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటే.. అందులో మీకోసం కొన్ని స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాం. అందులో మీకు నచ్చిన బ్రాండ్ 5G స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Poco F4 5G :
పోకో F4 5G సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్ 10 5G బ్యాండ్లకు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 870 ద్వారా పనిచేస్తుంది. గేమింగ్, డిమాండ్ ఉన్న యాప్‌లను ఆపరేట్ చేసేందుకు వీలుగా ప్రాసెసర్ అందిస్తోంది. అలాగే AMOLED డిస్ప్లే డాల్బీ విజన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఇతర ఫీచర్లలో 67W ఫాస్ట్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీ, బ్లూటూత్ 5.2, Poco Android 12-ఆధారిత MIUI 13 ఉన్నాయి. Poco F4 5G అద్భుతమైన కెమెరాలతో వచ్చింది. 4Kలో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. భారత మార్కెట్లో Poco F4 5G ధర రూ. 29,999గా ఉంది.
Motorola Edge 30 :
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటరోలా Motorola Edge 30 మోడల్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ పర్ఫార్మెన్ అద్భుతంగా ఉంటుంది. అందుకే Motorola Edge 30 స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్పెషల్ pOLED డిస్ప్లేతో వస్తుంది. చాలా మంది కస్టమర్లు ఇష్టపడే క్లీన్ ఆండ్రాయిడ్ 12 ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 778G+ 5G నుంచి పవర్ అందిస్తుంది. సెల్ఫీ కెమెరా తక్కువగా ఉన్నప్పటికీ, OISతో వెనుక కెమెరా మంచి పనితీరును అందిస్తుంది. Motorola Edge 30 13 5G బ్యాండ్లకు సపోర్టు ఇస్తుంది. 33W ఛార్జింగ్‌తో 4020mAh బ్యాటరీని అందిస్తుంది. భారత మార్కెట్లో Motorola Edge 30 ధర రూ. 29,999గా ఉంది.
Vivo V23 :
వివో కంపెనీ అందించే సెల్ఫీ కెమెరా ఫోన్లలో Vivo V23 బెస్ట్ ఆప్షన్. ఫ్రంట్ నాచ్‌లో 50-MP మెయిన్ సెన్సార్, 8-MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. 90Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. గుడ్ వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. సెగ్మెంట్లోని ఇతర పోటీదారులతో పోలిస్తే.. ఆకర్షణీయమైన కలర్ అందిస్తోంది. 5G, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 4200mAh బ్యాటరీతో అద్భుతమైన డిజైన్, ఇతర ముఖ్య ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. భారత మార్కెట్లో Vivo V23 ధర రూ. 29,990గా ఉంది.
iQoo Neo 6 5G :
మీరు గేమింగ్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే iQoo Neo 6 5G బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. Poco F4 5G మాదిరిగా ఉంటాయి. 120Hz డిస్ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్ అందించదు. వేగవంతమైన 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీతో వస్తుంది. నాలుగు 5G బ్యాండ్లకు సపోర్టుతో వస్తుంది. మీ నెట్వర్క్ Airtel లేదా Jio SIM అయితే మరింత బెటర్‌గా ఉంటుంది. భారత మార్కెట్లో iQoo Neo 6 5G ధర రూ. 29,999 నుంచి అందుబాటులో ఉంది.
OnePlus Nord 2T 5G :
వన్ ప్లస్ అందించే స్మార్ట్ ఫోన్లలో వన్ ప్లస్ నార్డ్ సిరీస్ ఒకటి.. అందులో అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. చివరిగా OnePlus Nord 2T 5G స్మార్ట్ ఫోన్ అద్భుతంగా ఉంది. డిజైన్ పరంగా బాగుంది. ఈ ఫోన్ మంచి కెమెరా సిస్టమ్‌ను కూడా అందిస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. వన్‌ప్లస్ డైమెన్సిటీ 1300 SoC పనితీరుతో అందిస్తుంది. ఏడు 5G బ్యాండ్ సపోర్టు అందిస్తుంది. అందులో Airtel, Jio వంటి నెట్వర్క్ అయిన బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. భారత మార్కెట్లో OnePlus Nord 2T 5G ధర రూ. 28,999గా ఉంది.
Read Also :Best 5G Smartphones : రూ.15వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేయండి!