Best 5G Smartphones 2022 : రూ. 15వేల లోపు మంచి 5G ఫోన్ కావాలా? ఈ 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లపై ఓసారి లుక్కేయండి..!

Best 5G Smartphones 2022 : భారత మార్కెట్లో అతి త్వరలోనే 5G నెట్‌వర్క్ ప్రారంభం కానుంది. మీ స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్టు చేయదా? అయితే వెంటనే కొత్త 5G స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రెండూ తమ ప్లాట్‌ఫారమ్‌లలో దీపావళి సేల్ ప్రకటించాయి.

Best 5G Smartphones 2022 : రూ. 15వేల లోపు మంచి 5G ఫోన్ కావాలా? ఈ 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లపై ఓసారి లుక్కేయండి..!

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

Best 5G Smartphones 2022 : భారత మార్కెట్లో అతి త్వరలోనే 5G నెట్‌వర్క్ ప్రారంభం కానుంది. మీ స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్టు చేయదా? అయితే వెంటనే కొత్త 5G స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon Great Indian Festival Sale 2022), ఫ్లిప్‌కార్ట్ (Flipkart Big Billion Days Sale 2022) రెండూ తమ ప్లాట్‌ఫారమ్‌లలో దీపావళి సేల్ (Diwali Festival Sale) ప్రకటించాయి.

కస్టమర్‌లు కొన్ని 5G ఫోన్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 5G ఫోన్‌ల కోసం చూస్తున్నారా? అయితే మీ బడ్జెట్ రూ. 15వేలు లోపు ఉంటే.. మీకోసం కొన్ని బ్రాండ్‌ల నుండి 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాం. ఈ జాబితాలో Samsung Galaxy M13, Redmi Note 11T 5G, Poco M4 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

Samsung Galaxy M13 5G :
శాంసంగ్ గెలాక్సీ M13 5G బెస్ట్ 5G ఫోన్.. Amazonలో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. పెద్ద బ్యాటరీతో పాటు డిస్‌ప్లే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. 5,000mAh బ్యాటరీతో HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల LCD స్క్రీన్‌తో వస్తుంది. ఈ బడ్జెట్ Samsung ఫోన్ Mediatek Dimensity 700 చిప్‌తో పనిచేస్తుంది. కంపెనీ బాక్స్‌లో 15W ఛార్జర్‌ను అందిస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. క్వాలిటీ ఫోటోలను పొందవచ్చు. డే టైంలో కూడా కలర్‌ఫుల్ ఫొటోలను పొందవచ్చు. భారత మార్కెట్లో Samsung Galaxy M13 5G ధర ప్రస్తుతం రూ.11,999 నుంచి ప్రారంభమైంది. దీని అసలు ధర రూ. 13,999గా ఉంటుంది. మీరు Amazonలో రూ. 2వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ కార్డ్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ధరను మరింత తక్కువ ధరకే పొందవచ్చు.

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

Redmi Note 11T 5G :
రెడ్‌మి నోట్ 11T 5G మరొక బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్.. రూ. 15,000లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy M13 మాదిరిగానే హుడ్ కింద సాధారణ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కానీ, Xiaomi రిటైల్ బాక్స్‌లో 33Wఛార్జర్‌ను అందిస్తోంది. అధిక రిజల్యూషన్, రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో పెద్ద 6.6-అంగుళాల స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది. స్క్రీన్ FHD+ రిజల్యూషన్‌తో రన్ అవుతుంది. స్మోటర్ స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 90Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. MediaTekడైమెన్సిటీ 810 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది.

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. డిజైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కెమెరా కూడా అలాగే అందిస్తోంది. హ్యాండ్‌సెట్‌లో మెరుగైన ఆడియో అవుట్‌పుట్ స్టీరియో స్పీకర్‌లు కూడా ఉన్నాయి. Mi.comలో Redmi Note 11T 5G ప్రస్తుతం 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999గా ఉంది. కానీ, మీరు అమెజాన్‌లో అందుబాటులో ఉన్న కూపన్‌ను అప్లై చేస్తే.. 128GB మోడల్‌ను రూ.14,499కి పొందవచ్చు.

Poco M4 5G :
ఈ బడ్జెట్ ఫోన్ Poco M4 5G మోడల్ 11,000 ధర రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు. MediaTek డైమెన్సిటీ 700 SoCతో వచ్చింది. హుడ్ కింద, 5,000mAh బ్యాటరీ సపోర్టు కూడా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టును అందిస్తుంది. Samsung ఫోన్ కంటే మెరుగైనది కూడా. అద్భుతమైన కెమెరాలతో ఆకర్షణీయంగా ఉంది. 6.58-అంగుళాల Full HD+ స్క్రీన్ పవర్ ఫుల్, వీడియోలు చూసేందుకు సరిపోతుంది. భారత మార్కెట్లో ప్రస్తుతం Flipkartలో Poco M4 5G (4GB RAM + 64GB స్టోరేజ్) మోడల్ ధర రూ.10,999గా ఉంది.

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

iQOO Z6 Lite 5G :
ఐక్యూ Z6 Lite 5G స్మార్ట్ ఫోన్ రూ. 15,000లోపు బెస్ట్ 5G ఫోన్. కొత్త Qualcomm Snapdragon 4 Gen 1 ప్రాసెసర్‌తో వచ్చింది. ఈ డివైజ్ 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంది, సాధారణ 5,000mAh బ్యాటరీతో వచ్చింది. కంపెనీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టును కూడా అందించింది. iQOO ఈ బడ్జెట్ ఫోన్‌కు దీర్ఘకాలిక సపోర్టును అందిస్తోంది.

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

రెండు ఏళ్ల పాటు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో పాటు 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కెమెరా అద్భుతమైన ఫొటోలను అందిస్తుంది. Instagram అకౌంట్లో ఫొటోల కోసం బెస్ట్ షాట్‌లను తీసుకోవచ్చు. iQOO Z6 Lite 5G ధర ప్రస్తుతం రూ. 13,999గా ఉంది. కానీ, Amazonలో కూపన్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. వినియోగదారులు ఈ ఫోన్ రూ. 12,749 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

Need a good 5G phone under Rs 15,000_ Check out these options

Realme 9i 5G :
చివరగా, Realme 9i కూడా రూ. 15వేల లోపు మా బెస్ట్ 5G ఫోన్ అని చెప్పవచ్చు. 6.6-అంగుళాల FHD+ 90Hz స్క్రీన్, డైమెన్సిటీ 810 SoC, 18W ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో పెద్ద 5,000mAh బ్యాటరీతో వచ్చింది. ఇది ఆల్ రౌండర్ ఫోన్. అత్యుత్తమ కెమెరా సెటప్ అందించలేదు. Samsung Galaxy M13 లేదా Redmi Note 11Tతో మెరుగైన పర్ఫార్మెన్స్ పొందవచ్చు. భారత మార్కెట్లో Realme 9i 5G ధర రూ. 14,999తో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..