Best Mobile Phones : జూన్‌లో రూ.15వేల లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ ఇదేనా?

Best Mobile Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కంపెనీలు మిడిల్-రేంజ్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి.

Best Mobile Phones : జూన్‌లో రూ.15వేల లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ ఇదేనా?

Best Mobile Phones Under Rs 15,000 In June 2022 Include Realme C35 And Vivo T1 44w

Best Mobile Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కంపెనీలు మిడిల్-రేంజ్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. గతంలో ఫోన్‌ల తయారీ మునుపటి కంటే చాలా ఖరీదైనదిగా మారింది. అందుకే గ్లోబల్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగిపోయాయి. అయినా ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌ను మాత్రం స్మార్ట్ ఫోన్ మేకర్లు వదులుకోలేదు. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో రూ.15వేల లోపు ఫోన్లను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూనే ఉన్నాయి. సరసమైన ఫోన్లను కోరుకునే వినియోగదారుల కోసం ఈ నెల మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేశాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 15,000 కన్నా తక్కువ ధరకే చాలా స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. Realme, Redmi, Vivo వంటి బ్రాండ్‌లు ఇటీవల భారత్‌లో బడ్జెట్ స్మార్ట్ ఫ్లోన్లను తీసుకొచ్చాయి. పర్ఫార్మెన్స్ పరంగా ప్రాసెసర్‌లతో స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. పెద్ద డిస్‌ప్లేలు, మల్టీ కెమెరా వంటి ఫీచర్లు ఎక్కువగా కస్టమర్‌లను ఆకట్టుకుంటాయి. జూన్ 2022లో రూ. 15వేలు లేదా అంతకంటే తక్కువ ధర కలిగిన కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. అందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు.

Vivo T1 44W :
Vivo T1 44W స్మార్ట్ ఫోన్.. నాణ్యమైన బ్యాటరీ లైఫ్ కొరుకునే కస్టమర్లకు ఇది బెస్ట్ ఫోన్.. ఎందుకంటే.. ఈ ఫోన్లో బ్యాటరీ ఛార్జింగ్ వేగంగా అవుతుంది. Vivo T1 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. 28 నిమిషాల్లో 5000mAh బ్యాటరీ 50శాతం పూర్తి అవుతుందని కంపెనీ పేర్కొంది. Vivo T1 44W ఇతర స్పెసిఫికేషన్లలో 6.44-అంగుళాల FullHD AMOLED డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీ, 1TB వరకు స్టోరేజీ ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు, 50-MP ట్రిపుల్ కెమెరాలు, 16-MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Vivo T1 44W ప్రారంభ ధర రూ.14,499 Flipkartలో అందుబాటులో ఉంది.

Best Mobile Phones Under Rs 15,000 In June 2022 Include Realme C35 And Vivo T1 44w (2)

Best Mobile Phones Under Rs 15,000 In June 2022

Realme C35 :
Realme C-సిరీస్‌లో మార్కెట్‌లో రూ. 15,000లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ప్రీమియం ఫోన్ బ్రాండ్‌గా రియల్‌మి C-సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేయవచ్చు. బిగ్ బ్యాటరీ, బిగ్ డిస్‌ప్లే, ఆకర్షణీయమైన డిజైన్ కోసం చూస్తే.. Realme C35 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. Realme C35 టాప్ నాచ్‌తో 6.6-అంగుళాల ఫుల్‌హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తుంది. ఈ నాచ్ లోపల 8-MP కెమెరా ఉంది. బ్యాక్ కెమెరా 50-MP ట్రిపుల్ కెమెరాలతో వచ్చింది. ఈ ఫోన్ గరిష్టంగా 6GB RAM, 128GB స్టోరేజీతో ఆక్టా-కోర్ Unisoc T616 ప్రాసెసర్ రన్ అవుతుంది. ఈ ఫోన్ భారీ 5000mAh బ్యాటరీతో వచ్చింది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. Realme C35 బేస్ మోడల్ ధర రూ. 11,999గా ఉండగా.. Realme ఆన్‌లైన్ స్టోర్ Flipkart నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. మీకు సమీపంలోని రిటైల్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

Best Mobile Phones Under Rs 15,000 In June 2022 Include Realme C35 And Vivo T1 44w (3)

Best Mobile Phones Under Rs 15,000 In June 2022 

Oppo K10 :
Oppo ఇండియా నుంచి K10 ఫస్ట్ K-సిరీస్ ఫోన్‌ను మార్చిలో రిలీజ్ అయింది. కంపెనీ ఈ ఫోన్ 5G వెర్షన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ డిజైన్ కెమెరాలతో K10 బెస్ట్ ఆప్షన్. Oppo K10 ప్రీమియం రెనో-సిరీస్ ఫోన్‌లలో రెనో గ్లో డిజైన్‌తో వచ్చింది. అందులోనూ ఆకర్షణీయంగా ఉంటుంది. Oppo K10 50-MP ప్రైమరీ కెమెరాతో పాటు వెనుకవైపు మరో రెండు కెమెరాలు ఉన్నాయి. 16-MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని అందిస్తుంది. Oppo K10 ధర రూ. 14,990 నుంచి ప్రారంభమవుతుంది. Flipkart నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Best Mobile Phones Under Rs 15,000 In June 2022 Include Realme C35 And Vivo T1 44w (1)

Best Mobile Phones Under Rs 15,000 In June 2022

Read Also : Best Smartphones : రూ. 25వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనొచ్చు..!