Google ban: జాగ్రత్త! మీ ఫోన్‌లో ఈ 136 డేంజరస్ యాప్‌లు ఉంటే, బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పోవచ్చు

జాగ్రత్త! మీ ఫోన్ ద్వారా డబ్బు దోచుకునే అవకాశం ఉన్న యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయా? అయితే, వెంటనే అప్రమత్తం అవ్వండి.

Google ban: జాగ్రత్త! మీ ఫోన్‌లో ఈ 136 డేంజరస్ యాప్‌లు ఉంటే, బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పోవచ్చు

Smart Phone

Google removes 136 apps: జాగ్రత్త! మీ ఫోన్ ద్వారా డబ్బు దోచుకునే అవకాశం ఉన్న యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయా? అయితే, వెంటనే అప్రమత్తం అవ్వండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నుంచి మిలియన్ల డాలర్లను దోచుకున్న మరో మాల్వేర్ గురించి జింపేరియంలోని భద్రతా నిపుణులు వివరాలు అందించారు. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఈ యాప్‌లు మీ ఫోన్‌లో తరచూ వాడుతూ ఉండవచ్చు కూడా. లేటెస్ట్‌గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అటువంటి ప్రమాదకరమైన, నిషేధించబడిన 136 యాప్‌లను గుర్తించి తొలగించింది. మీ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఈ యాప్‌లు ఉంటే, వెంటనే వాటిని తొలగించాలని సూచించింది.

సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేసుకున్న యాప్స్‌గా గుర్తించిన గూగుల్.. మొత్తం 136 యాప్‌లను నిషేధించింది. గ్రిఫ్‌హోర్స్ ఆండ్రాయిడ్ ట్రోజన్(Grifthorse Android Trojan) ప్రమాదకరమైనదని, వినియోగదారులు దీనిని వెంటనే తమ స్మార్ట్‌ఫోన్ నుండి తీసివేయాలని కోరింది. ఈ ట్రోజన్ మాల్ వేర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేసుకుంది. Google నిషేధించిన యాప్ జాబితాలో హ్యాండీ ట్రాన్స్‌లేటర్ ప్రో, హార్ట్ రేట్ & పల్స్ ట్రాకర్, జియోస్పాట్: GPS లొకేషన్ ట్రాకర్, iCare – లొకేషన్, మై చాట్ ట్రాన్స్‌లేటర్ వంటివి ఉన్నాయి.

ఈ మాల్వేర్.. ఫిషింగ్ లింక్స్ పంపిస్తూ.. ఆఫర్లంటూ ఊరించి, పాపప్స్ క్లిక్ చేయగానే.. బ్యాంక్ డిటెయిల్స్, ఏటీఎం కార్డు డిటెయిల్స్, నెట్ బ్యాకింగ్ డిటెయిల్స్ తస్కరించి.. అకౌంట్లలో డబ్బులు కాజేస్తుంది. ఇలాంటి యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్‌లలోనూ ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న 136యాప్స్‌లో ఈ ట్రోజన్ మాల్ వేర్ నిక్షిప్తమై ఉందని చెబుతున్నారు.

గూగుల్ ప్లే స్టోర్‌లో నిషేధించబడిన యాప్‌ల పూర్తి జాబితా:
హ్యాండి ట్రాన్స్లేటర్ ప్రో, హార్ట్ రేట్ & పల్స్ ట్రాకర్, జియోస్పాట్: GPS లొకేషన్ ట్రాకర్, iCare – లొకేషన్, మై చాట్ ట్రాన్స్‌లేటర్, బస్ – మెట్రోలిస్ 2021, ఫ్రీ ట్రాన్స్‌లేటర్ ఫోటో, లాకర్ టూల్, ఫింగర్ ప్రింట్ ఛేంజర్, కాల్ రీకోడర్ ప్రో, ఇన్‌స్టంట్ స్పీచ్ ట్రాన్స్‌లేషన్, రేసర్స్ కార్ డ్రైవర్, స్లైమ్ సిమ్యులేటర్, కీబోర్డ్ థీమ్స్, వాట్స్ మి స్టిక్కర్, అమేజింగ్ వీడియో ఎడిటర్, సేఫ్ లాక్, హార్ట్ రిథమ్, స్మార్ట్ స్పాట్ లొకేటర్, కట్‌కట్ ప్రో