BSNL: బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లకు షాక్..

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌ ప్రీపెయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ వినిపించింది. అన్ని రాష్ట్రాల్లోని టెలికాం ఆపరేటర్లకు సూచనలిచ్చింది. లైఫ్‌టైమ్‌ ప్రీ-పెయిడ్‌ ప్లాన్స్....

BSNL: బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లకు షాక్..

bsnl

BSNL:  ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌ ప్రీపెయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ వినిపించింది. అన్ని రాష్ట్రాల్లోని టెలికాం ఆపరేటర్లకు సూచనలిచ్చింది. ఇకపై లైఫ్‌టైమ్‌ ప్రీ-పెయిడ్‌ ప్లాన్స్‌ను ఎత్తివేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించింది. డిసెంబర్ 1నుంచి పూర్తిగా రద్దు కానున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం లైఫ్ టైమ్ ప్రీపెయిడ్‌ ప్లాన్లలో కొనసాగుతున్న యూజర్లను ఇతర ప్లాన్‌‌లోకి షిఫ్ట్ చేయనుంది. ఆల్రెడీ అదే ప్లాన్‌లో ఉన్న యూజర్లకు నష్టం లేకుండా ఉండేందుకే ఇతర ప్లాన్‌లలోకి బదలాయిస్తున్నారు. లైఫ్‌ టైమ్‌ ప్లాన్లను రూ.107 రూపాయల ప్లాన్‌లోకి మార్చనుంది. ఈ మార్పు ప్రక్రియ డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.

యూజర్లకు రూ. 107 ప్లాన్‌లో ఉండే అడిషనల్ బెనిఫిట్స్ మాత్రం వర్తించబోవని కన్ఫామ్ చేశారు. రూ.107 ప్లాన్‌కు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ లేదు. కేవలం మూడు నెలలు మాత్రమే దీని వ్యాలిడిటీ పనిచేస్తుంది.

………………………………….. : బాలకృష్ణలాగా డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఇండస్ట్రీలో ఎవరూ లేరు: అల్లు అర్జున్

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 2399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీను 60 రోజులకు పెంచింది. దీంతో యూజర్లు 425 రోజుల వరకూ వ్యాలిడిటీ కలిసొస్తుంది.