Apple iPhone 14 : జియోమార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై అదిరిపోయే డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!

Apple iPhone 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డీల్ అందిస్తోంది జియోమార్ట్ (JioMart). లేటెస్ట్ iPhone 14ని కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ JioMart డీల్ మీ కోసమే. JioMart ఆఫ్‌లైన్ స్టోర్ నుంచి గరిష్టంగా రూ.7వేల తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Apple iPhone 14 : జియోమార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై అదిరిపోయే డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!

Buy Apple iPhone 14 at up to ₹7,000 discount on JioMart Here’s how

Apple iPhone 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డీల్ అందిస్తోంది జియోమార్ట్ (JioMart). లేటెస్ట్ iPhone 14ని కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ JioMart డీల్ మీ కోసమే. JioMart ఆఫ్‌లైన్ స్టోర్ నుంచి గరిష్టంగా రూ.7వేల తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని ద్వారా ఫోన్ ధర రూ. 72,900కి తగ్గుతుంది. Apple iPhone 14 ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. JioMart ఈ డివైజ్ రూ. 2వేల తగ్గింపుతో రూ. 77,900తో వచ్చింది. అదనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 5శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.

ఇందులో EMI, EMI యేతర లావాదేవీలు రెండూ ఉంటాయి. ఈ ఫోన్‌ను రూ. 72,900 వద్ద కొనుగోలు చేయవచ్చు JioMart ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా మాత్రమే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. Apple iPhone 14 6.1-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. మిడ్‌నైట్, బ్లూ, స్టార్‌లైట్, పర్పుల్, రెడ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

హ్యాండ్‌సెట్ థర్మల్ పర్ఫార్మెన్స్ కోసం అప్‌డేట్ చేసిన ఇంటర్నల్ డిజైన్‌తో వస్తుంది. సూపర్ రెటినా XDR OLED స్క్రీన్‌లు, 1200 nits పీక్ HDR బ్రైట్‌నెస్, డాల్బీ విజన్‌తో వస్తుంది. సాధారణ స్పిల్స్, వాటర్ రెసెస్టిన్స్, డెస్ట్ నిరోధకత నుంచి సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ ద్వారా ప్రొటెక్ట్ అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. iOS 16లో రన్ అవుతుంది. కెమెరాల విషయానికి వస్తే.. iPhone 14లో 12MP ప్రైమరీ లెన్స్ ఉంది.

Buy Apple iPhone 14 at up to ₹7,000 discount on JioMart Here’s how

Buy Apple iPhone 14 at up to ₹7,000 discount on JioMart Here’s how

ఇందులో పెద్ద సెన్సార్, పెద్ద పిక్సెల్‌లు ఉన్నాయి. తక్కువ-కాంతి వెలుతురులోనూ f/1.9 అపర్చర్‌తో కొత్త 12MP ఫ్రంట్ ట్రూడెప్త్ కెమెరా ఉంటుంది. ఆపిల్ వీడియో కోసం కొత్త యాక్షన్ మోడ్‌ను కూడా అందిస్తుంది. వీడియో క్యాప్చర్ చేసిన సమయంలో షేక్స్, మోషన్, వైబ్రేషన్‌లను ఎడ్జిట్ చేస్తుంది. అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్‌లు సినిమాటిక్ మోడ్‌ను కలిగి ఉంటాయి. యూజర్లను30 fps, 24 fps వద్ద 4K క్యాప్చర్ చేసేందుకు అనుమతిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లో 5G సపోర్ట్, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, రీడర్ మోడ్‌తో NFC వంటి మరిన్నో ఫీచర్లు ఉన్నాయి. Apple iPhone 14 శాటిలైట్ ద్వారా క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOS కలిగి ఉంది. కానీ, ప్రస్తుతానికి అమెరికా, కెనడా కోసం మాత్రమే అని చెప్పవచ్చు. iPhone 14లో ఈ క్రాష్ డిటెక్షన్ కార్ క్రాష్‌ అయిన సమయాల్లో ఎమర్జెన్సీ సర్వీసులకు డయల్ చేయగలదు. ఇంకా మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : New iPhone 14 : భారత్‌లో కొత్త ఐఫోన్ 14 తయారీ కేంద్రం.. రెండో ఆపిల్ సప్లయర్‌గా పెగాట్రాన్..!