Diwali with Mi sale: దీపావళి Mi సేల్‌.. స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ "Diwali with Mi" సేల్ ఆఫర్‌ నవంబర్ 6వ తేదీ వరకు ప్రకటించింది.

Diwali with Mi sale: దీపావళి Mi సేల్‌.. స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు

Mi

Diwali with Mi sale: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ “Diwali with Mi” సేల్ ఆఫర్‌ నవంబర్ 6వ తేదీ వరకు ప్రకటించింది. భారతదేశంలోని 20,000 రిటైల్ స్టోర్లలో ఈ సేల్ ఆఫర్ అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. Xiaomi ఆఫ్‌లైన్ వినియోగదారులు ఏయే ఉత్పత్తులపై తగ్గింపును పొందుతున్నారో ఇప్పుడు చూద్దాం.

ఆఫ్‌లైన్ కొనుగోలుదారుల కోసం దీపావళితో Mi సేల్‌లో, కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిపై రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

ఈ సేల్‌లో భాగంగా షావోమి స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, పలు గ్యాడ్జెట్స్‌పై డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ ఆఫర్స్‌ నవంబరు 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా ప్రతీరోజు 64మంది లక్కీ విన్నర్లకు రూ.వెయ్యి నుంచి రూ. 5లక్షల వరకు క్యాష్‌ప్రైజ్‌ను అందిస్తుంది. లక్కీ విన్నర్లకు లక్కీ డ్రా ద్వారా సెడాన్ కారు, సూపర్ బైక్స్‌ను షావోమీ అందించబోతుంది.

Redmi Note 10 Pro Max:

Redmi Note 10 Pro Max 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ. 18,400 ధరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ప్రకటన ప్రకారం, కస్టమర్లు రూ. 1,599 విలువైన రెడ్‌మి సోనిక్ బాస్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను కూడా ఇందులో ఉచితంగా పొందుతారు.

Redmi Note 10s:

ఈ ఫోన్ 6GB + 64GB వేరియంట్ 13,999 రూపాయల తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుంది. అయితే Redmi 10 Prime(4GB + 64GB) ధర రూ.11,999గా ఉండగా.. 8GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ రూ.28,999కి అమ్మబడుతుంది.

Redmi Smart TV X55:

స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వారికి ఈ సేల్‌లో రూ. 4,500 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇది ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు మరియు EMIలపై చెల్లుబాటు అవుతుంది. Redmi Smart TV X55పై రూ.5,000 తగ్గింపు ఇవ్వనున్నారు. కొనుగోలుదారులు ఈ స్మార్ట్ టీవీని రూ. 40,999కి పొందవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే, మీకు మరో రూ. 2,000 తగ్గింపు లభిస్తుంది.

55-అంగుళాల Mi TV 4X UHD:

మీరు ఈ టీవీని రూ. 42,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ అసలు ధర రూ. 44,999, అయితే, మీరు దీనిని రూ. 2వేల తగ్గింపులో పొందవచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్‌లు 50-అంగుళాల Mi TV 4X UHDని రూ. 38,999కి తగ్గించి, రూ.35,999 ధరకు దక్కే అవకాశం ఉంది.

Mi వాచ్ రివాల్వ్ యాక్టివ్:

Mi వాచ్ రివాల్వ్ యాక్టివ్ అసలు ధర రూ. 9,999 కాగా.. ఈ సేల్‌లో రూ. 7,999కే అందుబాటులో ఉంది. Mi Robot Vacuum-Mop P రూ. 5,000 తగ్గింపులో ఉంది. కస్టమర్లు దీనిని ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా రూ. 19,999కే కొనుగోలు చెయ్యవచ్చు.