Google Pixel 7 Series : గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ వచ్చేస్తోంది.. అమెజాన్‌‌లో ధర ఎంత, లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్..!

Google Pixel 7 Series : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ నుంచి కొత్త 7 సిరీస్ వచ్చేస్తోంది. అతి త్వరలో భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ (Pixel 7, Pixel 7 Pro) ప్రవేశపెట్టనుంది. రాబోయే లైనప్ అక్టోబర్ 6న లాంచ్ కానుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Google Pixel 7 Series : గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ వచ్చేస్తోంది.. అమెజాన్‌‌లో ధర ఎంత, లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్..!

Google Pixel 7 briefly appears on Amazon, price and release revealed

Google Pixel 7 Series : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ నుంచి కొత్త 7 సిరీస్ వచ్చేస్తోంది. అతి త్వరలో భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ (Pixel 7, Pixel 7 Pro) ప్రవేశపెట్టనుంది. రాబోయే లైనప్ అక్టోబర్ 6న లాంచ్ కానుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అధికారిక లాంచ్‌కు ముందే.. Pixel 7 ధర ఎంత అనేది రివీల్ అయింది. అయితే Google ఈసారి డివైజ్‌లో ఎలాంటి మార్పులు చేయనట్లు కనిపిస్తోంది. ట్విట్టర్‌లో టెక్ రివ్యూర్ బ్రాండన్ లీ స్క్రీన్‌షాట్ ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 7 అమెజాన్‌లో ప్రత్యక్షమైంది. అంటే.. ఈ స్మా‌ర్ట్‌ఫోన్ ధర $599 వద్ద ఉందని అంచనా.

బేస్ 128GB మోడల్‌కు దాదాపు ధర రూ. 50,000 వరకు ఉండనుంది. అమెజాన్ లిస్టులో Pixel 7 Series తేదీని అక్టోబర్ 13గా చూపిస్తోంది. Google Pixel 7 సిరీస్ నెక్స్ట్-జెన్ టెన్సర్ Google ఇంటర్నల్ చిప్‌సెట్‌ను కలిగి ఉందని తెలిపింది. Amazon స్మార్ట్‌ఫోన్ సేల్ లిస్టులో అదే హైలైట్ చేసింది. కానీ, చిప్‌సెట్ ఖచ్చితమైన మోనికర్‌ను రివీల్ చేయలేదు.

Google Pixel 7 briefly appears on Amazon, price and release revealed

Google Pixel 7 briefly appears on Amazon, price and release revealed

Pixel 7 Pro ధరపై క్లారిటీ లేదు :
గూగుల్ పిక్సెల్ 6 కూడా గత ఏడాది మాదిరిగానే $599 ధర వద్ద లాంచ్ అయింది. ఈ ఏడాదిలోనూ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ధరను (పిక్సెల్ 7) గూగుల్ మార్చడం లేదని సూచిస్తుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గూగుల్ గతంలో లాంచ్ చేసిన కొన్ని పిక్సెల్ ఫోన్‌లు గ్లోబల్ వేరియంట్‌ల కన్నా భారత మార్కెట్లో ఎక్కువ ధరను కలిగి ఉన్నాయి. Pixel 6a ధర 43,999తో ప్రారంభమైంది. ఈ ఏడాదిలో కూడా అదే పరిస్థితి ఉండొచ్చు. అయినప్పటికీ.. ఈ పిక్సెల్ 7పై చాలా మంది ఆండ్రాయిడ్ ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు.

Google Pixel 7 briefly appears on Amazon, price and release revealed

Google Pixel 7 briefly appears on Amazon, price and release revealed

ఎందుకంటే కొంతకాలంగా భారత మార్కెట్లో మొట్టమొదటి Google ఫ్లాగ్‌షిప్ ఫోన్.. దేశంలో పిక్సెల్ 5, పిక్సెల్ 6 సిరీస్‌లను గూగుల్ లాంచ్ చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో సాధారణ మోడల్ టోన్-డౌన్ వెర్షన్ పిక్సెల్ 6a (Pixel 6a)ని ఆవిష్కరించింది. కానీ, ఈ ఏడాదిలో ఎట్టకేలకు భారత్‌లో ప్రీమియం Google Pixel 7, Pixel 7 Pro లాంచ్ చేసే అవకాశం ఉంది. అంతేకాదు.. పిక్సెల్ వాచ్‌ (Pixel Watch)ను దేశంలో లాంచ్ చేస్తుందా లేదా అనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..