Electric Vehicles: ఇండియాలో 40ఏళ్ల క్రితమే టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్.. సాక్ష్యమిదే

ఎలక్ట్రిక్ వెహికల్స్ సంవత్సర కాలంగా ఇండియన్ మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. వీటి కోసం ఆతురతగా ఎదురుచూస్తుండగా కొన్ని బుకింగ్ లో ఉండగా మరికొన్ని రోడ్లపైకి వచ్చేశాయి. ఇదేదో కొత్త...

Electric Vehicles: ఇండియాలో 40ఏళ్ల క్రితమే టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్.. సాక్ష్యమిదే

Electric Vehicles

Electric Vehicles: ఎలక్ట్రిక్ వెహికల్స్ సంవత్సర కాలంగా ఇండియన్ మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. వీటి కోసం ఆతురతగా ఎదురుచూస్తుండగా కొన్ని బుకింగ్ లో ఉండగా మరికొన్ని రోడ్లపైకి వచ్చేశాయి. ఇదేదో కొత్త ట్రెండ్ లో వాటి కోసం ఎదురుచూస్తున్న వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. 40ఏళ్ల క్రితమే ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయంటే..

ఆ మోడల్ పేరు ‘Komal’ ఎలక్ట్రిక్ మొబైల్స్ ఇండియా లిమిటెడ్ దీనిని ప్రొడ్యూస్ చేసింది. మైసూర్ కు చెందిన ఈ కంపెనీ.. ఈ వెహికల్ ను స్టార్ ఆఫ మైసూర్ చేసిందట. 1980-81 మధ్య కాలంలో లాంచ్ అయింది.

‘ఇది పూర్తిగా ప్రభుత్వ కంపెనీనే. ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఛైర్ పర్సన్ గా వ్యవహరించేవారు’ అని అప్పటి జనరల్ మేనేజర్ సూర్య కుమార్ కిక్కేరీ చెబుతున్నారు.

…………………………………….: ఇవి తింటున్నారా.. ముసలితనం ముందే రావడం ఖాయం

19080-81 కాలంలో దీనిని ట్రయల్ ప్రొడక్షన్ నిర్వహించారు. పూణెలో ఉన్న ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పలు టెస్టులు నిర్వహించి.. మోటార్ వెహికల్ రూల్స్ అన్నింటా సంతృప్తికరంగా ఉండటంతో సర్టిఫికేషన్ పొంది రోడ్లమీదకు వచ్చేందుకు సర్టిఫికేట్ కూడా పొందింది.

దీనికి అప్పట్లోనే 10వేల బుకింగ్స్ దక్కాయట. ఆ తర్వాత తయారీ సంస్థ దగ్గర నిధుల్లేకపోవడంతో త్వరగానే మూతపడిందట. కేవలం ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే యూఎస్ఏలో ఉన్న హనీవెల్ నుంచి తెప్పించుకునే వారు. ఇక బ్యాటరీలతో సహా మిగిలిన పార్టులన్నింటినీ ఇండియాలోనే తయారుచేసేవారట.

12 వోల్టుల 70యాంపియర్ హవర్ బ్యాటరీతో 70కిలోమీటర్ల వేగం వరకూ వెళ్లగలిగేదని రికార్డులు చెబుతున్నాయి. దీని టాప్ స్పీడ్ గంటకు 35 నుంచి 40 కిలోమీటర్లు ఉండగా.. మెయింటైనెన్స్ కూడా చాలా తక్కువ. కేవలం దీని కోసం చేయాల్సిందల్లా డిజిల్డ్ వాటర్ మార్చుతుండటమే.

……………………………… : పవన్‌కళ్యాణ్ కోసం.. జాక్వెలిన్ అవుట్.. నర్గిస్ ఇన్..