Air India Express : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో సంక్షోభం.. 86 సర్వీసులు రద్దు, ప్రయాణికుల అవస్థలు

వరుస లీవులు పెట్టి సంక్షభానికి దారి తీశారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులు..అనారోగ్య కారణాల పేరు చెప్పి సెలవులు పెట్టారు. దాదాపు 3వందల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది సెలవులు పెట్టడంతో..

Air India Express : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో సంక్షోభం.. 86 సర్వీసులు రద్దు, ప్రయాణికుల అవస్థలు

Air India Express cancels 86 flights

Air India Express : ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. జీతాలు, అలవెన్సులు, ఇలా కారణం ఏదైనా సడెన్ లీవ్స్‌ పెట్టి షాకిస్తున్నారు. ఉన్నట్లుండి సిబ్బంది సెలవులు పెట్టడంతో..ముందే షెడ్యూల్‌ అయిన ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ మధ్యే విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బంది.. వరుస లీవులు పెట్టి సంక్షభానికి దారి తీశారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులు..అనారోగ్య కారణాల పేరు చెప్పి సెలవులు పెట్టారు. దాదాపు 3వందల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది సెలవులు పెట్టడంతో .. 86 ఫ్లైట్లు  రద్దయ్యాయి.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్‌ క్రూ సిబ్బంది కొన్నాళ్లుగా సంస్థ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఏఐఎక్స్‌ కనెక్ట్‌, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విలీన ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సిబ్బంది పలు అంశాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై సంస్థ దృష్టికి తీసుకెళ్లింది ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయిస్ యూనియన్. సిబ్బంది అందరినీ సమానంగా చూడడం లేదని ఆరోపించారు.

సడెన్‌గా విమానాలను రద్దు చేయడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ క్షమాపణలు చెప్పింది. ఏడు రోజుల్లోగా ప్రయాణాన్ని రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని సూచించింది. లేదా రిఫండ్‌ కోసం అప్లై చేసుకోవాలని కోరింది. సెలవుల్లో ఉన్న తమ సిబ్బందితో మాట్లాడి..త్వరలో ఫ్లైట్లను తిరిగి కొనసాగిస్తామని తెలిపింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్.

నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను కేంద్రప్రభుత్వం అమ్మకానికి పెట్టగా.. దానిని టాటా సంస్థ రూ.18 వేల కోట్లకు దక్కించుకుంది. కానీ ప్రైవేటీకరణను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించినా.. కేంద్రం మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రైవేటుపరం కావడంతో ఉద్యోగుల విషయంలో సంస్థ తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా లేఓవర్ సందర్భంగా హోటల్ హోటల్ రూమ్‌ షేర్ చేసుకోవాల్సిందేనన్న ఆదేశాలపై సిబ్బంది అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్లు ఒకేసారి సిక్ లీవ్ పెట్టడంతో విమానాలు నిలిచిపోయాయి.

Read Also : iPad 2022 Price : కొత్త ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో మోడల్స్ లాంచ్.. పాత ఐప్యాడ్ 2022 ధర భారీగా తగ్గింపు..!