iPhones Price Cut in India : ఐఫోన్ 13, ఐఫోన్ 12 సిరీస్‌పై భారీ తగ్గింపు.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే కొనేసుకోండి..!

iPhones Price Cut in India : ప్రముఖ ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ (Apple iPhones) ఎట్టకేలకు ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే ఐఫోన్ 14 సిరీస్ ప్రారంభ ధర రూ.79,990గా నిర్ణయించింది.

iPhones Price Cut in India : ఐఫోన్ 13, ఐఫోన్ 12 సిరీస్‌పై భారీ తగ్గింపు.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే కొనేసుకోండి..!

iPhone 13 and iPhone 12 price cut in India_ Check out new official prices

iPhones Price Cut in India : ప్రముఖ ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ (Apple iPhones) ఎట్టకేలకు ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే ఐఫోన్ 14 సిరీస్ ప్రారంభ ధర రూ.79,990గా నిర్ణయించింది. ఆపిల్ కొత్త ఐఫోన్‌లను లాంచ్ చేసిన సందర్భంగా పాత ఐఫోన్‌ల ధరలను కూడా భారీగా తగ్గించింది. అంతేకాదు.. ఐఫోన్ 11 (iPhone 11 Series)ని నిలిపివేసింది. iPhone 13, iPhone 12 భారత మార్కెట్లో భారీగా ధర తగ్గింపును పొందాయి. ప్రతి ఏడాదిలో ఆపిల్ తమ ఐఫోన్ మోడళ్లపై భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తూనే ఉంది. ఈ ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 13, ఐఫోన్ 12 సిరీస్‌లపై తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. ఈ రెండు మోడళ్లపై ధరను ఎంతవరకు ఆపిల్ తగ్గించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ 14 భారత మార్కెట్లో పాత ధరకే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు iPhone 13 ఒక ఏడాది తర్వాత డివైజ్ ధరను భారీగా తగ్గించింది. iPhone 13 ఇప్పుడు 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 69,990 ధరకు తగ్గించింది. మీరు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billon Days Sale), అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) ఈవెంట్‌లో చాలా తక్కువ ధరకు పొందవచ్చు. ఈ రెండు సేల్ ఈవెంట్‌లు వచ్చే వారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

iPhone 13 and iPhone 12 price cut in India_ Check out new official prices

iPhone 13 and iPhone 12 price cut in India_ Check out new official prices

ఐఫోన్ 13 సిరీస్ అసలు ధర రూ.79,990గా ఉంది. అంటే కస్టమర్లు రూ.10,000 తగ్గింపును పొందవచ్చు. Apple ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో రూ. 58,730 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది. కొన్ని ఇతర ఐఫోన్‌లలో కూడా అందుబాటులో ఉంది. మీ ఫోన్ కండీషన్, ఎన్ని ఏళ్ల నుంచి వాడుతున్నారు అనేది ఆధారంగా Exchange మొత్తం లెక్కిస్తారు. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ మీ పాత ఫోన్ Exchange ద్వారా రూ. 17,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 12 భారత్ మార్కెట్లో కూడా భారీగా తగ్గింది. ఈ డివైజ్ ధర ఇప్పుడు రూ. 59,990 నుంచి అందుబాటులో ఉంది.

అయినప్పటికీ, అమెజాన్ ఐఫోన్ 12 (64GB స్టోరేజ్ మోడల్) కేవలం ధర 52,999లకు విక్రయిస్తోంది. అమెజాన్‌లో కస్టమర్లు రూ. 10,950 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఐఫోన్ 12 మినీ ధర రూ. 55,999లకు అందిస్తుంది. ఈ ఏడాదిలో ఆపిల్ మినీ వెర్షన్‌ను లాంచ్ చేయలేదు. కొత్త iPhone 14 Plus మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఆపిల్ గతంలోనే Plus మోడళ్ల అమ్మకాలను నిలిపివేసింది. అయితే ఆపిల్ మళ్లీ ఐఫోన్ ప్లస్ మోడళ్లను తిరిగి తీసుకొస్తోంది. ఆపిల్ Plus మోడళ్లలో iPhone 14, iPhone 14 Pro స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తోంది.

Read Also : Apple IPhone 14 Series: భారత్‌లో ఐఫోన్ 14 సిరీస్ అందుబాటులోకి ఎప్పుడొస్తుంది? ధరలు ఎలా ఉన్నాయంటే?