iPhone 14 Price in India : కొత్త ఐఫోన్ 14 సిరీస్ అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.. కానీ, ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే..!

iPhone 14 Price in India : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్ కొత్త సిరీస్ ఐఫోన్ 14 (iPhone 14) గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్లోనూ ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను లాంచ్ చేసింది.

iPhone 14 Price in India : కొత్త ఐఫోన్ 14 సిరీస్ అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.. కానీ, ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే..!

iPhone 14 is available at an effective price of Rs 53,900, but conditions apply

iPhone 14 Price in India : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్ కొత్త సిరీస్ ఐఫోన్ 14 (iPhone 14) గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్లోనూ ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఐఫోన్ (iPhone 14 Series Price) ధర రూ. 79,900 నుంచి అందుబాటులో ఉంది. అయితే, ఈ కొత్త ఐఫోన్ 14 సిరీస్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. కానీ, మీరు అన్ని షరతులను నెరవేర్చాల్సి ఉంటుంది. అప్పుడు మీరు చాలా తక్కువ ధరకు iPhone 14 Series పొందవచ్చు.

Apple రిటైలర్ (India iStore)లో ఐఫోన్ 14 (iPhone 14)ను రూ. 53,900 ధరకు అందిస్తోంది. ఈ కొత్త iPhoneపై ఫ్లాట్ డిస్కౌంట్ అందించడం లేదు. కానీ, iPhone 14 తక్కువ ధరకు పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.. కొన్ని బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. భారత్ iStore‌లో కొత్త iPhone 14ని రూ. 79,900 ప్రారంభ ధరతో లిస్టు చేసింది. HDFC బ్యాంక్ డెబిట్ (HDFC Bank Debit Cards), HDFC క్రెడిట్ కార్డ్‌లపై రూ. 5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. 3,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. తద్వారా ఐఫోన్ 14 సిరీస్ ధర రూ.71,900కి తక్కువ ధరకు పొందవచ్చు.

iPhone 14 is available at an effective price of Rs 53,900, but conditions apply

iPhone 14 is available at an effective price of Rs 53,900, but conditions apply

ఐఫోన్ 11 ఉన్నవారు ఐఫోన్ 14 సిరీస్‌ను ధర రూ.53,900 వద్ద కొనుగోలు చేయవచ్చు. iPhone 11పై Exchange Offer కింద రూ. 18,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ భారీ డిస్కౌంట్ పొందాలంటే మీ డివైజ్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఇండియా iStore వెబ్‌సైట్‌లో ఆసక్తిగల వినియోగదారులు తమ ఇతర ఫోన్‌లపై Exchange Offers కూడా పొందవచ్చు. Apple అధికారిక ఆన్‌లైన్ స్టోర్ మీ ప్రస్తుత డివైజ్ Exchangeపై రూ. 2,200 నుంచి రూ. 58,730 మధ్య డిస్కౌంట్ అందించనుంది. మీ పాత ఐఫోన్‌ Exchange కోసం చూస్తున్నారా? మీ Apple అధికారిక సైట్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. అధికారిక సైట్‌కి వెళ్లి.. iPhone 14 లిస్టింగ్‌ని చెక్ చేసుకోవచ్చు. ట్రేడ్-ఇన్ కేటగిరీలో మీ ప్రస్తుత ఫోన్ కోసం Exchange మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు.

iPhone 14 is available at an effective price of Rs 53,900, but conditions apply

iPhone 14 is available at an effective price of Rs 53,900, but conditions apply

ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్‌(Amazon)లో రూ. 5,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. రెండు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో Exchange Offers వేర్వేరుగా ఉంటాయి. మీరు ఐఫోన్ 14ని తక్కువ ధరకు పొందలేని పక్షంలో మీరు ఐఫోన్ 13 (iPhone 13)ని కూడా కొనుగోలు చేయవచ్చు, ఈ రెండూ ఫోన్లు చాలా దగ్గరగా పోలి ఉంటాయి. ఇందులో పెద్దగా హార్డ్-కోర్ తేడా లేదు. ఐఫోన్ 13 భారత మార్కెట్లో రూ. 69,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. మీరు ఈ ఐఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) లేదా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) సమయంలో చాలా తక్కువ ధరకు పొందవచ్చు. రెండు సేల్ ఈవెంట్‌లు రాబోయే రోజుల్లో లేదా వారాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read Also : Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్.. కొత్త స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. బెస్ట్ డీల్స్ మీకోసం..!