iPhone 14 Pro Models in India : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ వచ్చేశాయి. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత? సేల్ డేట్ ఇదేనా? ఫుల్ లిస్ట్ మీకోసం..!

iPhone 14 Pro Models in India : ప్రపంచ ఐటీ దిగ్గజం (Apple) భారత మార్కెట్లోకి ఐఫోన్ 14 ప్రో మోడల్స్ (Apple iPhone 14 Pro Models) లాంచ్ చేసింది. మొత్తం నాలుగు కొత్త ఐఫోన్ 14 మోడల్స్ అందుబాటులోకి వచ్చేశాయి.

iPhone 14 Pro Models in India : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ వచ్చేశాయి. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత? సేల్ డేట్ ఇదేనా? ఫుల్ లిస్ట్ మీకోసం..!

iPhone 14 Pro and iPhone 14 Pro Max launched in India _ Top specs, price, sale date and other details

iPhone 14 Pro Models in India : ప్రపంచ ఐటీ దిగ్గజం (Apple) భారత మార్కెట్లోకి ఐఫోన్ 14 ప్రో మోడల్స్ (Apple iPhone 14 Pro Models) లాంచ్ చేసింది. మొత్తం నాలుగు కొత్త ఐఫోన్ 14 మోడల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 13 ప్రో (iPhone 13 Pro Models) కన్నా అప్‌గ్రేడెడ్ స్పెసిఫికేషన్‌లతో ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ప్రవేశపెట్టింది. ఈ ఐఫోన్ 14 ప్రో, Pro Max రెండూ మోడల్స్ పిల్ ఆకారపు నాచ్ డిజైన్‌తో వచ్చాయి. అయితే దీనిని ఆపిల్ ‘డైనమిక్ ఐలాండ్’ (Dynamic Island) అని పిలుస్తోంది. ఐఫోన్ 14 ప్రో మోడల్స్ సిల్వర్, గోల్డ్, స్పేస్ బ్లాక్, డీప్ పర్పల్ వంటి నాలుగు కలర్ వేరియంట్లలో వస్తాయి.

భారత మార్కెట్లో iPhone 14 Pro ప్రారంభ ధర రూ. 1,29,900గా ఉంది. iPhone 14 Pro Max ప్రారంభ ధర రూ. 1,39,900గా నిర్ణయించింది. 48-MP ప్రైమరీ కెమెరా నుంచి Apple లేటెస్ట్ A16 బయోనిక్ చిప్, అలాగే శాటిలైట్ కనెక్టివిటీ వంటి కొత్త ఫీచర్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. iPhone 14 Pro మోడల్స్ గత మోడల్ ఐఫోన్ల కన్నా పెద్ద అప్‌గ్రేడ్‌లతో వచ్చాయి. ఈ రెండు ఐఫోన్ 14 ప్రో మోడల్స్ అందించే స్పెసిఫికేషన్‌లు, వాటి ధరలను ఓసారి పరిశీలిద్దాం.

iPhone 14 Pro and iPhone 14 Pro Max launched in India _ Top specs, price, sale date and other details

iPhone 14 Pro and iPhone 14 Pro Max launched in India _ Top specs, price, sale date

iPhone 14 Pro, iPhone 14 Pro Max స్పెసిఫికేషన్‌లు :

Design : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడళ్లలో వైడ్ నాచ్‌ను తొలగించింది. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ ఇప్పటికీ ఐఫోన్ 13 వైడ్ నాచ్‌తో వస్తున్నాయి. ఫ్రంట్ సైడ్ Pro Models డైనమిక్ ఐలాండ్ నాచ్ లేదా పిల్ ఆకారపు నాచ్ డిజైన్‌తో వస్తాయి. ఇక వెనుక ప్యానెల్ డిజైన్ కూడా బాగుంది. ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో ఐఫోన్ 13 ప్రో సిరీస్ వలె ఆకర్షణీయంగా ఉంది. ఈసారి హై-ఎండ్ సెన్సార్‌లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Display : ఐఫోన్ 14 Pro మోడల్ 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వచ్చింది. ఐఫోన్ 14 Pro Maxలో 1600 నిట్స్ 2,000 నిట్స్, డాల్బీ విజన్, పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. పిల్ ఆకారపు నాచ్ డిజైన్‌తో పెద్ద 6.7-అంగుళాల స్క్రీన్‌తో వచ్చింది. HDR10తో ప్రో మోడల్‌లు ఆకర్షణీయంగా ఉంటాయి, గత ఏడాది మాదిరిగానే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఆపిల్ ఐఫోన్ ప్రో మోడల్స్ తీసుకొచ్చింది.

iPhone 14 Pro and iPhone 14 Pro Max launched in India _ Top specs, price, sale date and other details

iPhone 14 Pro and iPhone 14 Pro Max launched in India _ Top specs, price, sale date

Processor : ఆపిల్ ఐఫోన్ ప్రో మోడల్స్ A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తాయి. 4nm తయారీ ప్రక్రియతో పాటు 6 కోర్ CPUని ఉపయోగిస్తుంది. 20 శాతం తక్కువ శక్తిని వినియోగిస్తుందని Apple పేర్కొంది.

Cameras : iPhone 14 Pro, 14 Pro Max 48-MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తాయి. మొదటిసారిగా iPhoneలో జూమ్ ఫొటోల కోసం కొత్త 12-MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 12-MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఆపిల్ ప్రైమరీ 48-MP కెమెరా 12-MP బిన్డ్ ఫోటోలను అద్భుతంగా తీయగలదని కంపెనీ పేర్కొంది. అంతేకాదు.. తక్కువ-కాంతిలోనూ అద్భుతమైన షాట్‌లను తీయగలదు. అందులోనూ సెల్ఫీలు, వీడియో కాల్‌ చేసుకునేందుకు వీలుగా ఐఫోన్‌లలో 12-MP కెమెరాను అందిస్తాయి.

Battery : ఐఫోన్ 14 Pro మోడల్‌లు ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు.. రోజుంతా ఛార్జింగ్ వస్తుందని ఆపిల్ ధృవీకరించింది. మునుపటి మోడళ్లతో పోలిస్తే.. ఈ కొత్త ప్రో ఐఫోన్ మోడల్స్ మెరుగైన బ్యాటరీ పర్ఫార్మెన్స్ అందిస్తున్నాయని కంపెనీ పేర్కొంది.

iPhone 14 Pro and iPhone 14 Pro Max launched in India _ Top specs, price, sale date and other details

iPhone 14 Pro and iPhone 14 Pro Max launched in India _ Top specs, price, sale date

Software : సరికొత్త ఐఫోన్ 14 సిరీస్ లేటెస్ట్ iOS 16 సాఫ్ట్‌వేర్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.

Variants : ఈ ఐఫోన్ రెండు మోడల్స్ 128GB, 256GB, 512GB, 1TBతో సహా 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

ఇండియాలో iPhone Pro మోడల్స్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో iPhone 14 Pro బేస్ 128GB వెర్షన్ ధర రూ. 1,29,900తో ప్రారంభమవుతుంది. 256GB, 512GB, 1TB మోడల్‌లు వరుసగా రూ. 1,39,900, రూ. 1,59,900, రూ. 179,900గా ఉండనున్నాయి. iPhone 14 Pro Max బేస్ 128GB వేరియంట్ ధర రూ 1,39,900 నుంచి ప్రారంభమవుతుంది.

iPhone 14 Pro and iPhone 14 Pro Max launched in India _ Top specs, price, sale date and other details

iPhone 14 Pro and iPhone 14 Pro Max launched in India _ Top specs, price, sale date

256GB, 512GB, 1TB మోడల్‌లు వరుసగా 1,49,900, 1,69,900, రూ. 1,89,900 ధరలకు లభిస్తాయి. iPhone 14 Pro, 14 Pro Max భారత మార్కెట్లో సెప్టెంబర్ 9 నుంచి ప్రీ-ఆర్డర్‌ (iPhone Pro Models Pre-Orders)కు అందుబాటులో ఉంటాయి. iPhone 14 Pro, Pro Max సెప్టెంబర్ 13 నుంచి Apple స్టోర్ సహా ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి.

Read Also : Apple iPhone 11 Sale : అరే.. ఏంట్రా ఇది.. ఐఫోన్ 11 మోడల్ ఆపేసిన ఆపిల్.. ఫ్లిప్‌కార్ట్‌లో స్టాక్ ఉందిగా.. ఇప్పుడే కొనేసుకోండి.. ధర ఎంతంటే?