iPhone 14 Pro Design Leaked : లాంచ్‌కు ముందే ఆపిల్ 14ప్రో డిజైన్ లీక్.. రాబోయే ఐఫోన్‌‌ 14 గురించి ఈ 5 విషయాలు తెలుసా?

iPhone 14 Pro Design Leaked : ఆపిల్ దిగ్గజం (Apple) బ్రాండ్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) లాంచ్ అతి దగ్గరలోనే ఉంది. ఆపిల్ తమ ప్రొడక్టుల లాంచ్‌కు సంబంధించి ఈవెంట్‌ను ప్రకటించింది.

iPhone 14 Pro Design Leaked : లాంచ్‌కు ముందే ఆపిల్ 14ప్రో డిజైన్ లీక్.. రాబోయే ఐఫోన్‌‌ 14 గురించి ఈ 5 విషయాలు తెలుసా?

iPhone 14 Pro design Leaked 5 things we now know about the upcoming iPhone

iPhone 14 Pro Design Leaked : ఆపిల్ దిగ్గజం (Apple) బ్రాండ్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) లాంచ్ అతి దగ్గరలోనే ఉంది. ఆపిల్ తమ ప్రొడక్టుల లాంచ్‌కు సంబంధించి ఈవెంట్‌ను ప్రకటించింది. కంపెనీ కొన్ని ఇతర హార్డ్‌వేర్ ప్రొడక్టులతో పాటు కొత్త ఐఫోన్‌లను లాంచ్ చేసే అవకాశం ఉంది. అధికారిక లాంచ్‌కు ముందు, ఐఫోన్ 14pro సిరీస్ ఫోన్ ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఈ ఫొటోలు, వీడియోల్లో (iPhone 14 Pro) బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండింటినీ చూడవచ్చు.

2022 ఏడాదిలో ఐఫోన్ 14pro, ఐఫోన్ 14 ప్రోగా రెండు iPhone Pro మోడల్‌లు రానున్నాయి. ఈ ప్రో మోడళ్లకు సంబంధించి ఈవెంట్ ప్రతి ఏడాది మాదిరిగానే ఉంటుంది. Pro Max ఎప్పటిలాగే పెద్ద స్క్రీన్‌తో రానుంది. ఈ ఏడాదిలో 6.7-అంగుళాల పెద్ద స్క్రీన్‌తో రెండు ఐఫోన్‌లు రానున్నాయి. ఈ మోడళ్లలో iPhone 14 Pro Max, iPhone 14 Max కూడా ఉన్నాయి.

iPhone 14 Pro design Leaked 5 things we now know about the upcoming iPhone

iPhone 14 Pro design Leaked 5 things we now know about the upcoming iPhone

ఈ ఏడాదిలో ఆపిల్ లాంచ్ చేయనున్న 4 మోడల్స్‌లో iPhone 14 Max ఒకటి. ఈ మోడల్ సరసమైన ధరకే అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ ఎక్కువగా ఇష్టపడే యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఆపిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే iPhone SE సిరీస్ అంతగా సక్సెస్ కాలేదు. దాంతో ఈ ఏడాదిలో ఐఫోన్ మినీ మోడల్‌ను నిలిపివేయాలని ఆపిల్ భావిస్తోంది.

iPhone 14 Pro అతి త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ iPhone 14 Pro లీకైన ఫొటోలు, వీడియోల్లో ఫోన్ సంబంధిత వివరాలు తెలిశాయి. ఐఫోన్ 14Pro కన్నా ఐఫోన్ 13proతో కొంచెం భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉండనుంది. ఐఫోన్ 14 Pro అద్భుతమైన డిజైన్‌ను అందిస్తోంది.

* లీకైన ఫొటోలు, వీడియోల ప్రకారం.. రాబోయే iPhone 14 Pro సిరీస్ కొత్త నాచ్ డిస్‌ప్లేతో రానుంది. ఐఫోన్ 13 ప్రోలో కనిపించే వైడ్ నాచ్‌కు బదులుగా పిల్ ఆకారపు డిజైన్‌తో ఐఫోన్ 14Pro ఉన్నట్లు కనిపిస్తోంది. సెంటర్ నాచ్ కొంచెం వెడల్పుగా కనిపిస్తుంది. దాని ప్రక్కన LED ఫ్లాష్ కూడా ఉంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 Max ఐఫోన్ 13 సిరీస్ వంటి వైడ్ నాచ్‌తో రానున్నాయి.

* వీడియో ఇయర్‌పీస్‌ను నాచ్‌కి దగ్గరగా ఉంటుంది. బెజెల్స్ చాలా సన్నగా కనిపిస్తాయి. పిల్-ఆకారపు నాచ్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలతో కనిపిస్తుంది. Apple ఇంకా కెమెరా వివరాలను వెల్లడించలేదు.

* లీక్ వీడియోలను పరిశీలిస్తే.. iPhone 14 Pro పర్పుల్ కలర్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. చూడటానికి సూపర్ క్లాస్‌గా కనిపిస్తుంది. Apple గత ఏడాది మాదిరిగానే మరికొన్ని కలర్ ఆప్షన్లను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. రంగు ఆప్షన్లకు సంబంధించి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

iPhone 14 Pro design Leaked 5 things we now know about the upcoming iPhone

iPhone 14 Pro design Leaked 5 things we now know about the upcoming iPhone

* రియర్ ప్యానెల్ డిజైన్ iPhone 13 Pro మాదిరిగా కనిపిస్తుంది. ఈసారి రాబోయే ఐఫోన్ల మోడళ్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. వెనుక ప్యానెల్‌లో చదరపు ఆకారపు మాడ్యూల్ లోపల 3 కెమెరాలు ఉంటాయి. కెమెరా స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. iPhone 13 Pro మెరుగైన తక్కువ-కాంతి ఫోటోలను తీసేందుకు పెద్ద సెన్సార్‌లను అందిస్తోంది. ఐఫోన్ 14pro మోడల్స్ 48MPప్రైమరీ కెమెరాను అందిస్తాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఐఫోన్‌లలో సాధారణంగా లేని మంచి మూన్ షాట్‌లను రాబోయే ఐఫోన్‌లలో వచ్చే అవకాశం ఉందని ఆపిల్ ఈవెంట్ నివేదిక సూచిస్తోంది.

* ఐఫోన్ 14 ప్రో ఫోన్ నాచ్ డిజైన్‌తో పాటు వస్తోంది. ఐఫోన్ 14 Pro ఐఫోన్ 13 Pro మాదిరిగానే కనిపిస్తుంది. డిజైన్‌లో పెద్దగా తేడా లేదనే చెప్పాలి. ఐఫోన్ 14 Pro పాత వెర్షన్ చాలా అప్‌గ్రేడ్ వెర్షన్. A16 బయోనిక్ చిప్, iOS 16 అవుట్-ఆఫ్-ది-బాక్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్, మెరుగైన కెమెరా పర్ఫార్మెన్స్ అందిస్తోంది.

Read Also : Apple iPhone 14 Max : ఆపిల్ కొత్త ఐఫోన్ 14 Max మోడల్ వస్తోంది.. సెప్టెంబర్ 7న లాంచ్ అయ్యే ఛాన్స్..!