iPhone 14 Pro Models : ఈ హాలీడే సీజన్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కొనుగోలు కష్టమే.. ఎందుకో తెలుసా?

iPhone 14 Pro Models : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) గత సెప్టెంబర్‌లో గ్లోబల్ మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో మోడల్స్ (iPhone 14 Pro) లాంచ్ చేసింది. అయితే అప్పటినుంచి iPhone 14 Pro ఆర్డర్‌లను పొందడం కష్టంగా మారింది.

iPhone 14 Pro Models : ఈ హాలీడే సీజన్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కొనుగోలు కష్టమే.. ఎందుకో తెలుసా?

iPhone 14 Pro models won't be so easy to get this holiday season_ Here's why

iPhone 14 Pro Models : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) గత సెప్టెంబర్‌లో గ్లోబల్ మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో మోడల్స్ (iPhone 14 Pro) లాంచ్ చేసింది. అయితే అప్పటినుంచి iPhone 14 Pro ఆర్డర్‌లను పొందడం కష్టంగా మారింది. డివైజ్ షిప్‌మెంట్, ఉత్పత్తి సంబంధిత సమస్యలను ఆపిల్ ఎదుర్కొంటోంది. వచ్చే డిసెంబర్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతాయని కొత్త నివేదిక సూచిస్తుంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. Apple కీలకమైన అసెంబ్లీ ప్లాంట్ కలిగిన చైనాలోని Zhengzhouలో కఠినమైన COVID-19 లాక్‌డౌన్ కారణంగా iPhone 14 Pro, 14 Pro Max మోడ్‌లు డెలివరీ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని నివేదిక తెలిపింది. అమెరికాలో iPhone 14 Pro Models డెలివరీకి 37 రోజులు పట్టవచ్చు.

ఎందుకంటే Foxconn Technology Group ద్వారా నిర్వహించే Zhengzhou సదుపాయం ప్రపంచంలోని iPhone Pro సరఫరాలో ఎక్కువ భాగం అక్కడే ఉంది. కానీ, ఫ్యాక్టరీలో 2లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌లతో సరఫరా గొలుసులో పెద్ద అంతరాయం ఏర్పడింది. లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది 6 మిలియన్ల ఐఫోన్ ప్రో యూనిట్ల కొరతను ఆపిల్ అంచనా వేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. ఆపిల్ ప్రొడక్టుల ఉత్పత్తిలో పతనం కూడా అధ్వాన్నంగా మారింది.

iPhone 14 Pro models won't be so easy to get this holiday season_ Here's why

iPhone 14 Pro models won’t be so easy to get this holiday season

Read Also : iPhone 13 Big Discount : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై బిగ్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

ఎందుకంటే పశ్చిమ దేశాలలో చాలా దేశాలు హాలీడే జరుపుకుంటాయి. హాలిడే సీజన్ అంటే.. గిఫ్ట్ ఇచ్చే కాలం అని కూడా చెప్పవచ్చు. అందుకే అనేక ఈ-కామర్స్, ఆఫ్‌లైన్ బ్రాండ్‌లు తమ హాలిడే సేల్స్‌ను హోస్ట్ చేస్తాయి. అదనంగా, సాధారణ iPhone 14, iPhone 14 Max గత ఏడాదిలో iPhone 13, 13 mini స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే డిమాండ్‌ ఏర్పడింది. అందుకే ఈ ఏడాదిలో హాలిడే సీజన్ Appleకి కీలకంగా మారింది.

చైనాలోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలోనూ ఆపిల్ సమస్యలు ఎదుర్కొంటోంది. లేటెస్టుగా దాదాపు 20వేల మంది ఉద్యోగులు ఫ్యాక్టరీ నుంచి వైదొలిగినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. లాక్‌డౌన్‌లు తొలగించినప్పటికీ.. ఉద్యోగులు ఆకస్మికంగా వదిలిపోవడంతో పూర్తి ఉత్పత్తిని పునఃప్రారంభించాలనే ఫాక్స్‌కాన్ లక్ష్యాన్నిచేరుకోవడం కష్టంగా మారింది. ఇంతకు ముందే చెప్పినట్లుగా.. iPhone 14 Pro సమస్య కొత్తది కాదు.. సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు ఆఫ్‌లైన్ స్టోర్‌లు ప్రీ-బుక్ చేసిన కస్టమర్ల కోసం యూనిట్‌లకు ప్రాధాన్యత ఇస్తాయని తెలిపింది.

ముగిసిన తర్వాత, సాధారణ కస్టమర్‌లు iPhone 14 Pro లేదా iPhone 14 Pro Maxని కొనుగోలు చేసే అవకాశాన్ని పొందవచ్చు. ప్రస్తుతం, Apple India వెబ్‌సైట్ iPhone 14 Pro కోసం నాలుగు వారాల డెలివరీ సమయాన్ని చూపిస్తుంది.14 Pro Max కూడా డెలివరీకి అదే సమయాన్ని సూచిస్తోంది. Flipkart వంటి భాగస్వామి ప్లాట్‌ఫారమ్‌లలో iPhone 14 Pro, 14 Pro Max ప్రస్తుతానికి అందుబాటులో లేవు. అమెజాన్‌లోనూ అందుబాటులో లేవనే చెప్పాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Flipkart Offer : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై అదిరే డీల్.. ఫీచర్లు అదుర్స్.. ఇలా చేస్తే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..!