Motorola 5G Update : మోటోరోలా 5G అప్‌డేట్ ఏయే డివైజ్‌ల్లో వచ్చిందో తెలుసా? అందులో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి!

Motorola 5G Update : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ తయారీదారు మోటోరోలా (Motorola) కూడా 5G అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇప్పటికే సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung), Apple, Google తమ కంపెనీ మొబైల్ డివైజ్‌ల్లో 5G అప్‌డేట్ రిలీజ్ చేశాయి.

Motorola 5G Update : మోటోరోలా 5G అప్‌డేట్ ఏయే డివైజ్‌ల్లో వచ్చిందో తెలుసా? అందులో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి!

Motorola reveals device-wise 5G update availability details, check out when your phone will get it

Motorola 5G Update : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ తయారీదారు మోటోరోలా (Motorola) కూడా 5G అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇప్పటికే సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung), Apple, Google తమ కంపెనీ మొబైల్ డివైజ్‌ల్లో 5G అప్‌డేట్ రిలీజ్ చేశాయి. లేటెస్టుగా Motorola తమ డివైజ్‌లు వారీగా 5G అప్‌డేట్ వివరాలను వెల్లడించింది. భారత్‌లో చాలా 5G-సపోర్టెడ్ ఫోన్‌లకు 5G రేడియో ఫ్రీక్వెన్సీలకు సపోర్టును ప్రారంభించేందుకు తయారీదారు నుంచి కొత్త అప్‌డేట్ నవీకరణ అవసరమని గుర్తించాలి.

Motorola ఫోన్‌లలో 5G సపోర్ట్‌ని లాంచ్ చేసేందుకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు ధృవీకరించింది. Apple వంటి పెద్ద టెక్ బ్రాండ్‌లు డిసెంబరులో అప్‌డేట్ అందిస్తామని వెల్లడించింది. Lenovo యాజమాన్యంలోని కంపెనీ నవంబర్ మొదటి వారంలోపు అన్ని Motorola డివైజ్‌లకు సపోర్టు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Motorola reveals device-wise 5G update availability details, check out when your phone will get it

Motorola reveals device-wise 5G update availability details

భారత్‌లో మోటోరోలా 5G స్మార్ట్‌ఫోన్‌లు మొత్తం 8 సబ్ 6 GHz 5G బ్యాండ్‌లతో సహా 11 నుండి 13 5G బ్యాండ్‌లకు హార్డ్‌వేర్ సపోర్టును అందిస్తున్నాయి. ఇప్పటికే SA (Reliance Jio), NSA (Airtel & Vi) 5G మోడ్‌లలో 5Gని ప్రారంభించేందుకు OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తోంది.

మోటోరోలా డివైజ్‌ల్లో ఏకకాలంలో యూజర్లు ఆపరేటర్‌లలో 5Gని యాక్సస్ చేసుకోవచ్చునని మోటరోలా ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ప్రారంభించిన మోటరోలా Edge 30 Ultra, Edge 30 Fusionపై అప్‌డేట్‌లు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఇతర మోటోరోలా 5G డివైజ్‌లు తదుపరి వారాల్లో అప్‌డేట్స్ రానున్నాయి. నవంబర్ 2022 మొదటి వారంలో అప్‌డేట్స్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ప్రశాంత్ మణి తెలిపారు. Moto Edge 30 Ultra, Moto Edge 30 Fusion అప్‌డేట్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

Motorola reveals device-wise 5G update availability details, check out when your phone will get it

Motorola reveals device-wise 5G update availability details

యూజర్లు ఈ అప్‌డేట్స్ డౌన్‌లోడ్ చేయడానికి వారి ఫోన్ Settings సెక్షన్ > Software Updates వెళ్లవచ్చు. Moto G62 5G, Moto G82 5G, Moto Edge 30 వంటి ఇతర హ్యాండ్‌సెట్‌లు అక్టోబర్ 25న 5G అప్‌డేట్‌ను అందుకోనున్నాయి. Moto G71 5G, Moto Edge 30 Pro, Moto G51 5G, Moto Edge 20 Pro, Moto Edge 20, Moto Edge 20 ఫ్యూజన్ నవంబర్ 5న అప్‌డేట్ అందుకోనుంది. Samsung వంటి ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు వచ్చే నెలలో వచ్చే నవంబర్‌లో చాలా డివైజ్‌లకు అప్‌డేట్స్ అందజేస్తామని అంటున్నారు. Google డిసెంబర్‌లో పిక్సెల్ 6aకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను రిలీజ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. పిక్సెల్ 7 సిరీస్‌లోని కొన్ని ఫీచర్లను కూడా తీసుకువస్తుంది. OnePlus తన 5G ఫోన్‌ల కోసం టైమ్‌లైన్‌ను ఇంకా వెల్లడించలేదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Motorola Edge 30 Series : 200MP కెమెరాలతో మోటోరోలా ఎడ్జ్ 30 సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?