OnePlus 11 5G Discount : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 5G ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

OnePlus 11 5G Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 5G ఫోన్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా వన్‌ప్లస్ 11 5G ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

OnePlus 11 5G Discount : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 5G ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

OnePlus 11 5G 8GB RAM price drops with 8 Percent discount

OnePlus 11 5G Discount : వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ద్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ వన్‌ప్లస్ (OnePlus) 5G ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం (OnePlus 11) 5G ఫోన్ ధర రూ.58,999 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్‌లో 8శాతం డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. తద్వారా ఈ 5G ఫోన్ ధర రూ.54,200కి తగ్గింది. ఈ అద్భుతమైన ఆఫర్ ఇ-కామర్స్ సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వన్‌ప్లస్ 5G ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు.

వన్‌ప్లస్ 11 5G స్పెసిఫికేషన్‌లు :
OnePlus 11 ఫోన్‌లో 6.7-అంగుళాల QHD+ AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. స్క్రీన్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో హోల్-పంచ్ కటౌట్ ఉంటుంది. అది కర్వ్ తిరిగి ఉంటుంది. అదనంగా, వన్‌ప్లస్ ఫోన్ 1300-నిట్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ కూడా HDR10+ సర్టిఫికేట్ పొందింది. మీకు అత్యంత స్పష్టమైన రియల్ కలర్లను అందిస్తుంది.

Read Also : OnePlus Bullets Wireless Z2 : వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ Z2 ఇయర్‌ఫోన్లు.. కేవలం రూ.2,299 మాత్రమే.. సంగీత ప్రియులకు పండగే..!

Adreno GPU, Qualcomm Snapdragon 8 Gen2 SoC కారణంగా OnePlus 11 పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. గరిష్టంగా 8GB వరకు LPDDR5 RAM, 128GB UFS 4.0 స్టోరేజీతో వస్తుంది. ఈ పవర్‌ఫుల్ ప్రాసెసర్, అన్ని ప్రోగ్రామ్‌లు, గేమ్‌లు, ఫొటోలకు తగినంత స్పీడ్ స్పేస్ అందిస్తుంది.

OnePlus 11 5G 8GB RAM price drops with 8 Percent discount

OnePlus 11 5G Discount 8GB RAM price drops with 8 Percent discount

ఈ ఫోన్ భారీ 5000mAh బ్యాటరీతో వస్తుంది. వన్‌ప్లస్ 11 కెమెరా అద్భుతంగా ఉంది. వెనుకవైపు ఉన్న ట్రిపుల్ కెమెరా సిస్టమ్ అద్భుతమైన ఫొటోలు, వీడియోలను తీసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ 48MP Sony IMX581 సెన్సార్‌ను కలిగి ఉంది. అయితే, ప్రధాన కెమెరా OISతో 50MP సోనీ IMX890 సెన్సార్‌ను కలిగి ఉంది. 32MP సోనీ IMX709 2x టెలిఫోటో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం సెల్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా కూడా అందిస్తోంది.

Read Also : Apple iPhone 11 Discount : ఆపిల్ ఐఫోన్ 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో లిమిటెడ్ ఆఫర్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!