Flipkart Delivery Orders : ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఇకపై క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లపై ఛార్జీలు చెల్లించాల్సిందే..!

Flipkart Delivery Orders : వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లపై హ్యాండ్లింగ్ ఫీజును ప్రవేశపెట్టింది.

Flipkart Delivery Orders : ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఇకపై క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లపై ఛార్జీలు చెల్లించాల్సిందే..!

Online shopping via Flipkart Now pay extra for cash on delivery orders

Flipkart Delivery Orders : వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లపై హ్యాండ్లింగ్ ఫీజును ప్రవేశపెట్టింది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ (Flipkart Mobile App) వెబ్‌సైట్‌లో వినియోగదారుల ‘Cash On Delivery’ పేమెంట్ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు ఈ-టైలర్ ఇప్పుడు నామమాత్రపు రుసుము రూ. 5 వసూలు చేస్తుంది. ప్రస్తుతం, Flipkart నిర్దిష్ట ధర కేటగిరీ కన్నా తక్కువ ప్రొడక్టులకు డెలివరీ ఛార్జీలను వసూలు చేస్తుంది. ప్రతి డీలర్లతో ఛార్జీలు మారుతూ ఉంటాయి.

Flipkart Plusగా లిస్టు అయిన ప్రొడక్టులపై ఆర్డర్ విలువ రూ. 500 కన్నా తక్కువ ఉంటే రూ. 40 డెలివరీ రుసుమును డిమాండ్ చేస్తుంది. మరోవైపు, రూ. 500 కన్నా ఎక్కువ ఆర్డర్‌లపై డెలివరీ ఛార్జీలు ఉండవు. ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌గా లిస్టు అయిన ప్రొడక్టుల కోసం, ఆర్డర్ విలువ రూ. 500 కన్నా తక్కువగా ఉంటే.. ఒక్కో వస్తువుకు డెలివరీకి రూ.40 ఛార్జీ విధిస్తారు. అయితే, రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లు ఉచితంగా డెలివరీ చేయవచ్చునిని ఫ్లిప్‌కార్ట్ వెబ్ పేజీ చూపిస్తుంది.

Online shopping via Flipkart Now pay extra for cash on delivery orders

Online shopping via Flipkart Now pay extra for cash on delivery orders

కానీ, ఇప్పుడు, డెలివరీ ఛార్జీ లేదా డెలివరీ ఛార్జీ లేకుండా, ఫ్లిప్‌కార్ట్ అన్ని క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లకు రూ. 5 మెయింట్ నెన్స్ ఛార్జీలను వసూలు చేస్తుంది. దీని కారణంగా ఈ ఎంపికను (COD) ఉపయోగించి చేసే ఆర్డర్‌లకు నామమాత్రంగా రూ. 5 ఛార్జ్ చేస్తుంది. అప్పటికప్పుడే ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఫ్లిప్‌కార్ట్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇలా ఉంటుంది.

Flipkart 2021-22లో 31శాతం రాబడి వృద్ధిని రూ.10,659 కోట్లకు నివేదించింది. రవాణా, మార్కెటింగ్, చట్టపరమైన ఖర్చుల కారణంగా ఆర్థిక సంవత్సరంలో దాని నికర నష్టం 51శాతం పెరిగి రూ. 4,362 కోట్లకు చేరుకుంది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ యాక్సెస్ చేసిన డేటా ప్రకారం.. దాని నిర్వహణ ఆదాయాలు FY21లో Rs7,804 కోట్లతో పోలిస్తే.. FY22లో Rs10,477 కోట్లకు పెరిగాయి. ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ఫ్యాషన్ రిటైలర్ Myntra ఆపరేటింగ్ ఆదాయం FY22లో 45శాతం పెరిగి రూ. 3,501.2 కోట్లకు చేరుకుంది. రూ. 597.6 కోట్ల నష్టాన్ని నివేదించింది.

అంతకుముందు సంవత్సరంలో Rs429 కోట్ల నుండి పెరిగింది. ఫ్లిప్‌కార్ట్ పోటీదారు అయిన అమెజాన్ ఇండియా మార్కెట్‌ప్లేస్ వర్టికల్, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ కోసం 32.5శాతం వార్షిక రాబడి వృద్ధిని నమోదు చేసి రూ. 21,462 కోట్లకు చేరుకుంది. FY22లో నష్టాలను 23శాతం తగ్గించి రూ. 3,649 కోట్లకు తగ్గించింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Big Diwali Sale : బిగ్ దీపావళి సేల్.. ఈ ఫెస్టివల్ సీజన్‌లో 5 కార్పొరేట్ గిఫ్ట్ ప్రొడక్టులు.. భారీ డిస్కౌంట్లు.. త్వరపడండి!