Flipkart Discount Offer: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్.. చౌకగా 5G స్మార్ట్ ఫోన్!

పండుగ సీజన్‌లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి.

Flipkart Discount Offer: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్.. చౌకగా 5G స్మార్ట్ ఫోన్!

Flipkart

Flipkart Discount Offer: పండుగ సీజన్‌లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ దీపావళికి చౌకైన 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ఆలోచిస్తుంటే, మాత్రం మీ కోసం మంచి ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో Poco M3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.1250 వరకు తగ్గింపు లభిస్తుంది.

ధర, ఆఫర్:
POCO M3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. అదే సమయంలో, దాని 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర రూ .16,499. అయితే, మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కోసం SBI కార్డును ఉపయోగిస్తే, 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. రూ.1250 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. పోకో 5G ఫోన్‌ను రూ.503 EMI కట్టి కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

Specifications:
POCO M3 ప్రో 5G 6.50-అంగుళాల ఫుల్-హెచ్‌డి+డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇందులో 48-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అందుబాటులో ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే..
POCO M3 ప్రో 5Gలో మూడు రేర్ కెమెరాలను ఉన్నాయి. వీటిలో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.

ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. దీంతోపాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.89 సెంటీమీటర్లుగానూ, బరువు 190 గ్రాములుగా ఉంది. ఫోన్ Android 11 ఆధారంగా Realme UI 2.0లో పనిచేస్తుంది.