Raksha Bandhan Sale : రక్షా బంధన్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Raksha Bandhan Sale : రక్షా బంధన్ సేల్ మొదలైందోచ్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. విజయ్ సేల్స్ ఐఫోన్లపై అనేక ఆఫర్లను అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.

Raksha Bandhan Sale : రక్షా బంధన్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Raksha Bandhan Sale _ Vijay Sales offers amazing discount on iPhone 14

Raksha Bandhan Sale : రక్షా బంధన్ సందర్భంగా విజయ్ సేల్స్ (Vijay Sales) ఆపిల్ ఐఫోన్లపై అనేక ఆఫర్లను అందిస్తోంది. భారత అత్యంత ముఖ్యమైన పండుగలలో రక్షా బంధన్ ఒకటి.. ఈ పండుగ రోజున తోబుట్టువుల మధ్య బంధానికి ప్రతీకగా సోదరులకు రాఖీలను కడుతుంటారు. ఈ రాఖీని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు విజయ్ సేల్స్ ఆపిల్ ప్రొడక్టులపై ప్రత్యేకమైన సేల్ ఆఫర్‌లతో ముందుకు వచ్చింది. విజయ్ సేల్స్‌పై ఐఫోన్ 14పై తగ్గింపు ఆఫర్‌ను పొందవచ్చు. ఈ డీల్‌కి వెళ్లే ముందు ఐఫోన్ 14ని ఎందుకు కొనుగోలు చేయాలనే విషయాన్ని పరిశీలిద్దాం.

ఐఫోన్ 14 ఎందుకు కొనాలి? :
ఆపిల్ ఐఫోన్ 14 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో వస్తుంది. ఐఫోన్ 14 రోజంతా బ్యాటరీ లైఫ్, 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ని పొందవచ్చు. మీ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు స్మార్ట్‌ఫోన్ (iOS16)తో వస్తుంది. ఐఫోన్ 14 మెరుగైన ఫొటోలకు అడ్వాన్సడ్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12MP డ్యూయల్ వెనుక కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సూపర్‌ఫాస్ట్ 5G సెల్యులార్ లైటనింగ్-స్పీడ్ పర్ఫార్మెన్స్ 5-కోర్ GPUతో A15 బయోనిక్ చిప్‌తో వస్తుంది.

Read Also : Jio AirFiber vs Airtel AirFiber : ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్‌కు పోటీగా జియో ఎయిర్‌ఫైబర్.. రెండింటి మధ్య ఇంటర్నెట్ స్పీడ్, ధర ఎంత? బెనిఫిట్స్ ఏంటి?

ఫోన్ డిస్కౌంట్ :
విజయ్ సేల్స్ 10శాతం ప్రారంభ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఐఫోన్ ధర రూ. 79,900 నుంచి రూ. 71,990 పొందవచ్చు. ఇదొక్కటే కాదు.. కస్టమర్లు విజయ్ సేల్స్ స్టోర్లలో స్కీమ్, అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌లో ట్రేడ్‌ను పొందవచ్చు.

Raksha Bandhan Sale _ Vijay Sales offers amazing discount on iPhone 14

Raksha Bandhan Sale _ Vijay Sales offers amazing discount on iPhone 14

ఎక్స్ఛేంజ్ డీల్ :
విజయ్ సేల్స్ కూడా డివైజ్ ధర మరింత తగ్గేలా ఎక్స్ఛేంజ్ డీల్‌ను అందిస్తుంది. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. మీ ప్రాంతంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభ్యతను చెక్ చేయడానికి మీ పిన్ కోడ్‌ను కూడా ఎంటర్ చేయాలి.

బ్యాంక్ డిస్కౌంట్ :
విజయ్ సేల్స్ వివిధ బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI పై రూ.2వేల వరకు 7.5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. HSBC క్రెడిట్ కార్డ్‌పై రూ.7500 వరకు 7.5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లలో YES బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.2వేల వరకు 5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇతర బ్యాంక్ ఆఫర్‌లలో క్రెడిట్ కార్డ్ EMIపై రూ.3వేల వరకు 10శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : Apple iPhone 15 Launch Event : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్ ఈవెంట్ డేట్ తెలిసిందోచ్.. కొత్త ఐఫోన్లతో పాటు మరెన్నో ప్రొడక్టులు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!