Realme 11 Pro 5G Series : రియల్‌మి 11ప్రో 5G సిరీస్ లాంచ్ ఆఫర్.. ఈ నెల 8నే లాంచ్.. ప్రీ-ఆర్డర్ డేట్ ఇదిగో..!

Realme 11 Pro 5G Series : రియల్‌మి 11 Pro 5G, రియల్‌మి 11 Pro+ 5G వనిల్లా రియల్‌మి 11తో పాటు మేలో చైనా మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

Realme 11 Pro 5G Series : రియల్‌మి 11ప్రో 5G సిరీస్ లాంచ్ ఆఫర్.. ఈ నెల 8నే లాంచ్.. ప్రీ-ఆర్డర్ డేట్ ఇదిగో..!

Realme 11 Pro 5G Series India Launch Offer, Pre-Order Date Tipped Ahead of Debut on June 8

Realme 11 Pro 5G Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి 11 Pro 5G సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ నెల 8న భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అధికారిక లాంచ్‌కు కొద్ది రోజుల ముందే లేటెస్ట్ లీక్ Realme 11 Pro+ 5G, Realme 11 Pro 5G లాంచ్ ఆఫర్,ప్రీ-ఆర్డర్ తేదీని రివీల్ చేసింది. రియల్‌మి 11 Pro 5G సిరీస్ మేలో చైనాలో అరంగేట్రం చేసింది.

ఆక్టా-కోర్ 6nm MediaTek డైమెన్సిటీ 7050 SoC ద్వారా ఆధారంగా పనిచేస్తుంది. గరిష్టంగా 12GB RAMతో వస్తుంది. రియల్‌మి 11 Pro 5G డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. అయితే, Realme 11 Pro+ 5G ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.

Read Also : Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..!

టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ (@Sudhanshu1414) ట్విట్టర్ పోస్ట్ ద్వారా Realme 11 Pro 5G సిరీస్ ఇండియా లాంచ్ ఆఫర్, ప్రీ-ఆర్డర్ తేదీని లీక్ చేశారు. టిప్‌స్టర్ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్‌ల ప్రీ-ఆర్డర్‌లు జూన్ 8 నుంచి ప్రారంభమై జూలై 14న ముగుస్తాయి. ఈ హ్యాండ్‌సెట్‌లను ప్రీ-రిజర్వ్ చేసుకున్న కస్టమర్‌లు రూ. 4,499 విలువైన రియల్‌మి వాచ్ 2 ప్రోని పొందవచ్చు. రియల్‌మి నో-కాస్ట్ EMI ఆప్షన్ల కోసం వివిధ బ్యాంక్ ఆఫర్‌లను అందించనుంది.

Realme 11 Pro 5G Series India Launch Offer, Pre-Order Date Tipped Ahead of Debut on June 8

Realme 11 Pro 5G Series India Launch Offer, Pre-Order Date Tipped Ahead of Debut on June 8

రియల్‌మి 11 Pro 5G సిరీస్ లాంచ్ జూన్ 8న భారత మార్కెట్లో మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫ్లిప్‌కార్ట్‌లోని మైక్రోసైట్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ వివరాలను రివీల్ చేసింది. రియల్‌మి 11 Pro 5G, Realme 11 Pro+ 5G ప్రారంభంలో చైనాలో CNY 1,699 (దాదాపు రూ. 20వేలు), CNY 1,999 (దాదాపు రూ. 24వేలు) ప్రారంభ ధరతో మేలో లాంచ్ అయ్యాయి.

రియల్‌మి 11 Pro, Realme 11 Pro+ చైనీస్ వేరియంట్‌లు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,412 పిక్సెల్‌లు) కర్వ్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు ఆక్టా-కోర్ 6nm MediaTek డైమెన్సిటీ 7050 SoC ద్వారా పనిచేస్తాయి. గరిష్టంగా 12GB RAMతో వస్తాయి.

కెమెరాల విషయానికి వస్తే.. రియల్‌మి 11 Pro 100MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. అయితే, Realme 11 Pro+ 200MP, Samsung HP3 సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. రెండు మోడళ్లకు 5,000mAh బ్యాటరీ సపోర్టు అందిస్తుంది. Realme 11 Pro 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో పాటు రియల్‌మి 11 Pro+ 100W ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది.

Read Also : Jio True 5G Services : తెలంగాణలో 850కిపైగా ప్రాంతాల్లో రిలయన్స్ జియో ట్రూ 5G సర్వీసులు..!